‘నువ్వెవరు అంటే ఎవరూ చెప్పరేమిటమ్మా’ ?
కార్తీకదీపం సీరియల్ లో తన తండ్రి ఎవరో చెప్పాలని శౌర్య, తన తల్లి ఎవరో చెప్పాలని హిమ తమ తమ పెద్దలను అదేపనిగా ప్రశ్నిస్తుంటే.. వాళ్ళు ఎటూ చెప్పలేక సతమతమవుతున్న తాజా ఎపిసోడ్ ఇది ! శ్రావ్య ఇంటికి ఎందుకు వెళ్లావని తల్లిని నిలదీసిన శౌర్యను దీప తీవ్రంగా మందలిస్తుంది. అవును.. నాకు అందరూ ఉన్నారు.. నాకు తండ్రి, పిన్ని, చెల్లి, అంతా ఉన్నారు.. ఏం ? నీకు అన్నీ చెప్పాలా ? అని ప్రశ్నిస్తుంది. […]
కార్తీకదీపం సీరియల్ లో తన తండ్రి ఎవరో చెప్పాలని శౌర్య, తన తల్లి ఎవరో చెప్పాలని హిమ తమ తమ పెద్దలను అదేపనిగా ప్రశ్నిస్తుంటే.. వాళ్ళు ఎటూ చెప్పలేక సతమతమవుతున్న తాజా ఎపిసోడ్ ఇది ! శ్రావ్య ఇంటికి ఎందుకు వెళ్లావని తల్లిని నిలదీసిన శౌర్యను దీప తీవ్రంగా మందలిస్తుంది. అవును.. నాకు అందరూ ఉన్నారు.. నాకు తండ్రి, పిన్ని, చెల్లి, అంతా ఉన్నారు.. ఏం ? నీకు అన్నీ చెప్పాలా ? అని ప్రశ్నిస్తుంది. అయితే అందరూ ఉన్నా మన ఇంటికి ఎవరూ రారేమిటమ్మా అని అమాయకంగా ఎదురు ప్రశ్నిస్తుంది శౌర్య.. దానికి సమాధానం చెప్పలేకపోతుంది దీప. ఇద్దరూ ఒకరినొకరు కన్నీటి పర్యంతమవుతారు. కూతురిని దీప ఆప్యాయంగా హత్తుకుని తన బాధను మరచిపోవడానికి ప్రయత్నిస్తుంది.
సీన్ మారితే.. కార్తీక్ ఇంట్లో అంతా డిన్నర్ చేస్తున్న వేళ.. హిమ మళ్ళీ తన తల్లి ఎవరనే ప్రశ్నను లేవనెత్తుతుంది. ఆ చిన్నారి తన తల్లిని పెద్దమ్మే అనుకుని మాట్లాడుతుంటే కార్తీక్ గానీ, సౌందర్య గానీ, ఆమె భర్త గానీ ఏమీ చెప్పలేక, నిజాన్ని కక్కలేక నానా ఇబ్బందులు పడుతుంటారు. అందరూ తన పెద్దమ్మను వంటలక్క .. వంటలక్క అంటూ ఉంటే మీరెవరూ ఏమీ మాట్లాడరేమిటని, శ్రావ్య ఇంట్లో తనకు అంతా తెలిసిపోయిందని హిమ అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. తన కూతురిని ఏమీ అనలేక మధ్యలో కార్తీక్ తన తల్లిమీద మండిపడతాడు. అటు హిమ కన్నీరు చూసినా చలించని కార్తీక్.. ఆమెపై కేకలు వేస్తూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఇక రాబోయే ఎపిసోడ్ లో మళ్ళీ శౌర్య, హిమ తమ తండ్రి గురించి ఒకరు, తల్లి గురించి మరొకరు మధనపడే అంశమే హైలైట్ కానుంది. వీరిద్దరికీ అసలు నిజాలు తెలియాలంటే మరికొన్ని ఎపిసోడ్లు చూడక తప్పదు.