‘ఢిల్లీ పీఠం మాదే ! ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు’.. బీజేపీ

ఢిల్లీ ఎన్నికల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కు క్లియర్ మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్  స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రిడిక్షన్ ని బీజేపీ కొట్టిపారేసింది. ఇవి ఎగ్జాక్ట్ పోల్స్ కాదని ఈ పార్టీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి అన్నారు. పార్టీకి చెందిన ఇతర నేతలతో కలిసి.. హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయి వఛ్చిన ఆమె.. మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ కాదని, డేటాను […]

'ఢిల్లీ పీఠం మాదే ! ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు'.. బీజేపీ
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Feb 09, 2020 | 2:39 PM

ఢిల్లీ ఎన్నికల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కు క్లియర్ మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్  స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రిడిక్షన్ ని బీజేపీ కొట్టిపారేసింది. ఇవి ఎగ్జాక్ట్ పోల్స్ కాదని ఈ పార్టీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి అన్నారు. పార్టీకి చెందిన ఇతర నేతలతో కలిసి.. హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయి వఛ్చిన ఆమె.. మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ కాదని, డేటాను సాయంత్రం నాలుగు లేదా అయిదు గంటలవరకు మాత్రమే సేకరించారని అన్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ పై తమ సమావేశంలో చర్చించామన్నారు. మా ఓటర్లు ఆలస్యంగా వచ్చారు. సాయంత్రం అయ్యాక కూడా ఓటు చేశారు అని ఆమె చెప్పారు. బీజేపీ కార్యకర్తలు తమ కుటుంబాలతో కలిసి ఉదయం పదిన్నర గంటలకల్లా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలని, అయితే సాయంత్రం అయినా  కార్యకర్తలంతా తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అమిత్ షా కోరిన విషయాన్ని లేఖి గుర్తు చేశారు. ఈ నెల 11 న వెలువడే ఫలితాలు అందర్నీ షాక్ కి గురి చేస్తాయి అని ఆయన వ్యాఖ్యానించారని ఆమె అన్నారు. ఈ ఎన్నికల్లో ఆప్ కు 56 సీట్లు వస్తాయని, బీజేపీకి దాదాపు 14 స్థానాలు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 36 ఉంటే సరిపోతుంది.