AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రమోషన్లలో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు…

ప్రభుత్వ ఉదోగాల్లో ప్రమోషన్లకు గాను రిజర్వేషన్లు, కోటాలు అన్నవి ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాష్టాలు తప్పనిసరిగా కోటా (రిజర్వేషన్లు) కల్పించాలని తాము ఒత్తిడి చేయలేమని పేర్కొంది. ప్రజా సర్వీసులో కొన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంలో అసమానతలను చూపే డేటా లేకుండా ఇలా ఆయా  రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించలేమని స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో.. ప్రజాపనుల శాఖలోని అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ పోస్టులకు సిబ్బంది  ప్రమోషన్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ల అమలును సవాలు […]

ప్రమోషన్లలో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు...
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 10, 2020 | 12:10 PM

Share

ప్రభుత్వ ఉదోగాల్లో ప్రమోషన్లకు గాను రిజర్వేషన్లు, కోటాలు అన్నవి ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాష్టాలు తప్పనిసరిగా కోటా (రిజర్వేషన్లు) కల్పించాలని తాము ఒత్తిడి చేయలేమని పేర్కొంది. ప్రజా సర్వీసులో కొన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంలో అసమానతలను చూపే డేటా లేకుండా ఇలా ఆయా  రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించలేమని స్పష్టం చేసింది.

ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో.. ప్రజాపనుల శాఖలోని అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ పోస్టులకు సిబ్బంది  ప్రమోషన్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ల అమలును సవాలు చేస్తూ దాఖలైన అపీళ్ళను  అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఈ విధమైన రిజర్వేషన్లకు ప్రాథమిక హక్కు అంటూ ఉండజాలదని, ఒక రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా వీటిని అమలు చేయాలని ఆదేశించలేమని కోర్టు వివరించింది. ప్రమోషన్లలో రిజర్వేషన్ల అంశానికి కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది.

న్యాయమూర్తులు ఎల్. నాగేశ్వర రావు, హేమంత్ గుప్తాలతో కూడిన బెంచ్ ఈ నెల 7 న ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్లకు సంబంధించి కొన్ని వర్గాలకు కోటా కల్పించాలని ఆదేశిస్తూ.. ఉత్తరాఖండ్ హైకోర్టు 2012 లో ఇఛ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Follow Us
భారత్ వర్సెస్ శ్రీలంక ‘ఎ’ జట్ల సమరం..మ్యాచ్ లైవ్ ఎప్పుడు?
భారత్ వర్సెస్ శ్రీలంక ‘ఎ’ జట్ల సమరం..మ్యాచ్ లైవ్ ఎప్పుడు?
కిడ్నీ వ్యాధి మరణాల్లో తెలంగాణనే టాప్! కారణాలు ఇవే
కిడ్నీ వ్యాధి మరణాల్లో తెలంగాణనే టాప్! కారణాలు ఇవే
సర్కార్‌ బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్.. ఇవన్నీ ఫ్రీగా తినొచ్చు
సర్కార్‌ బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్.. ఇవన్నీ ఫ్రీగా తినొచ్చు
స్కూల్స్ రీ ఓపెన్: మీ పిల్లలు బడికి వెళ్లనంటూ ఏడుస్తున్నారా..?
స్కూల్స్ రీ ఓపెన్: మీ పిల్లలు బడికి వెళ్లనంటూ ఏడుస్తున్నారా..?
జానూ ఎక్కడమ్మ.. పవన్‌ ఆదేశాలతో రంగంలోకి హనుమాన్ టీమ్
జానూ ఎక్కడమ్మ.. పవన్‌ ఆదేశాలతో రంగంలోకి హనుమాన్ టీమ్
టీ అమ్ముకుంటూనే.. పార్ట్ టైమ్‌గా పక్కనే హాస్పిటల్ తేరిచాడు!
టీ అమ్ముకుంటూనే.. పార్ట్ టైమ్‌గా పక్కనే హాస్పిటల్ తేరిచాడు!
గుడి మెట్లమీద స్టార్ హీరో.. బిచ్చగాడు అనికొని రూ.10వేసిన మహిళ
గుడి మెట్లమీద స్టార్ హీరో.. బిచ్చగాడు అనికొని రూ.10వేసిన మహిళ
అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్‌లో ఏం వెతుకుతున్నారో తెలుసా?
కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్‌లో ఏం వెతుకుతున్నారో తెలుసా?
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..?
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..?