‘షికారా’ మూవీ చూసి కన్నీటి పర్యంతమైన అద్వానీ

కాశ్మీరీ పండిట్లు తమ రాష్ట్రం నుంచి వలస పోతున్న కాన్సెప్ట్ తో బాలీవుడ్ దర్శక నిర్మాత విధు వినోద్ చోప్రా తీసిన ‘షికారా ‘  చిత్రం చూసి బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ చిత్రం క్లైమాక్స్ సీన్ చూస్తూ.. తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. అద్వానీ కుటుంబ సభ్యులకు చోప్రా ప్రత్యేకంగా ఈ షో చూపడం విశేషం. అద్వానీని స్వయంగా చోప్రా దగ్గరకి వచ్చి ఓదార్చారు. మంచి చిత్రాన్ని తీశావంటూ ఆ తరువాత అద్వానీ ఆయనను […]

'షికారా' మూవీ చూసి కన్నీటి పర్యంతమైన అద్వానీ
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Feb 09, 2020 | 11:22 AM

కాశ్మీరీ పండిట్లు తమ రాష్ట్రం నుంచి వలస పోతున్న కాన్సెప్ట్ తో బాలీవుడ్ దర్శక నిర్మాత విధు వినోద్ చోప్రా తీసిన ‘షికారా ‘  చిత్రం చూసి బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ చిత్రం క్లైమాక్స్ సీన్ చూస్తూ.. తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. అద్వానీ కుటుంబ సభ్యులకు చోప్రా ప్రత్యేకంగా ఈ షో చూపడం విశేషం. అద్వానీని స్వయంగా చోప్రా దగ్గరకి వచ్చి ఓదార్చారు. మంచి చిత్రాన్ని తీశావంటూ ఆ తరువాత అద్వానీ ఆయనను అభినందించారు. 1990 ప్రాంతంలో కాశ్మీర్లో అల్లర్లు రేగినప్పుడు ఈ రాష్ట్రం నుంచి బలవంతంగా ఇతర ప్రాంతాలకు తరలవలసి వచ్చింది. అయితే ఆ తరువాత వారు మళ్ళీ తమ జీవితాలను ఎలా చక్కదిద్దుకున్నారన్నది ఈ సినిమా ఇతివృత్తం. ఆదిల్ ఖాన్, సాడియా  నటించిన ఈ సినిమా ఈ నెల 7 న విడుదలయింది. . కాశ్మీర్ కు చెందిన చోప్రా ఈ సినిమాను తన తల్లికి అంకితం ఇచ్చ్చారు. ఆమె 2007 లో మరణించింది.