బికినీ ఫొటోపై కామెంట్లు చేసిన వారికి కౌంటర్ ఇచ్చిన కంగనా.. మతంపై మీకే అధికారమున్నట్లు నటించొద్దంటూ వ్యాఖ్యలు.
సుశాంత్ సింగ్ ఆత్మహత్య నుంచి మొదలైన కంగనా కాంట్రవర్సీలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కంగానా రనౌత్ ట్విట్టర్ వేదికగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఒక్కసారిగా హీట్‌ని పెంచేశాయి. వివరాల్లోకి వెళితే..

Kangana reacts on trolling her bikini photo: నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేస్తున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో కంగనా ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య నుంచి మొదలైన కంగనా కాంట్రవర్సీలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కంగానా రనౌత్ ట్విట్టర్ వేదికగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఒక్కసారిగా హీట్‌ని పెంచేశాయి. వివరాల్లోకి వెళితే..
Good morning friends, one of the most exciting places that I visited in my life is Mexico, beautiful but an unpredictable place, here’s a picture from Tulum a little island in Mexico ❤️ pic.twitter.com/8b0M7ymMiX
— Kangana Ranaut (@KanganaTeam) December 23, 2020
బీచ్ ఒడ్డున బికినీలో దిగిన ఓ ఫొటోను బుధవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కంగనా.. ఆ ఫొటోకు ‘నేను జీవితంలో ఎంతో కుతుహలంతో వెళ్లిన అందమైన ప్రదేశాల్లో మెక్సికో ఒకటి. మెక్సికోలోని తులుం ఐలాండ్‌లో దిగిన ఫొటోనే ఇది’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అయితే ఈ పోస్ట్ చూసిన కొంతమంది నెటిజన్లు కంగనాను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ‘భారతీయ సంప్రదాయాలు, విలువల గురించి మాట్లాడే కంగనా ఇలాంటి దుస్తులు ధరించడమేంటని’ కామెంట్లు చేశారు.
कुछ लोग मेरी बिकिनी पिक्चर देखकर मुझे धर्म और सनातन का लेक्चर दे रहे हैं, अगर कभी माँ भैरवी बाल खोल, वस्त्रहीन, ख़ून पीने वाली छवि लेकर सामने आ जाए तो तुम्हारा क्या होगा? तुम्हारी तो फट जाएगी और ख़ुद को भक्त कहते हो? धर्म पे चलो उसके ठेकेदार मत बनो…. जय श्री राम ? pic.twitter.com/AIyNrSiTTT
— Kangana Ranaut (@KanganaTeam) December 23, 2020
అయితే తనపై జరుగుతోన్న ట్రోలింగ్‌పై స్పందించిన కంగనా ట్విట్టర్ వేదికగా మరో పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్ట్‌లో కంగానా.. ‘నా బికినీ ఫొటోను చూసి కొందరు వ్యక్తులు నాకు సనాతన ధర్మం గురించి హితబోధ చేస్తున్నారు. భైరవి దేవత జుట్టు విరబోసుకుని, దుస్తులు లేకుండా, రక్తం తాగుతూ మీ ముందు నిలబడితే మీరేం చేస్తారు. మీరు కచ్చితంగా భయపడతారు. ఆ సందర్భంలో మీరు భక్తులుగా చెప్పుకోరా. మతంపై మీకే అధికారమున్నట్లు నటించొద్దు’ అంటూ కామెంట్ చేసింది. ఇక పోస్ట్ చివరలో కంగనా ‘జై శ్రీరామ్’ అని ముగించారు.
