AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్ర సీఎంపై సినీ నటి కంగన సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ హీరో సుశాంత్ మరణానంతరం నిత్యం వార్తల్లో ఉన్న కంగనా ముంబై ప్రభుత్వ యంత్రాగం పనితీరును ఎండగడుతూ వస్తుంది. ఈసారి ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రినే టార్గెట్ చేసింది. ముంబయిలోని తన కార్యాలయాన్ని కూల్చేయడంపై నటి కంగనా రనౌత్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.

మహారాష్ట్ర సీఎంపై సినీ నటి కంగన సంచలన వ్యాఖ్యలు
Balaraju Goud
|

Updated on: Sep 10, 2020 | 7:51 AM

Share

బాలీవుడ్ హీరో సుశాంత్ మరణానంతరం నిత్యం వార్తల్లో ఉన్న కంగన ముంబై ప్రభుత్వ యంత్రాగం పనితీరును ఎండగడుతూ వస్తుంది. ఈసారి ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రినే టార్గెట్ చేసింది. ముంబయిలోని తన కార్యాలయాన్ని కూల్చేయడంపై నటి కంగన రనౌత్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. మూవీ మాఫియాతో సీఎం మిలాఖత్ అయ్యి తనపై పగ తీర్చుకుంటున్నారని ఆరోపించారు.

‘ఉద్ధవ్‌ ఠాక్రే.. మీకేమనిపిస్తోంది? మూవీ మాఫియాతో కలిసిపోయారు. నా ఇంటిని కూల్చి నా మీద పగ తీర్చుకున్నారని మీరు అనుకుంటున్నారు కదా? ఈ రోజు నా ఇంటిని కూల్చిశారు. రేపు మీ అహంకారం అలానే కూలిపోతుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిత్యం పరిగెడుతూనే ఉంటుందనేది గుర్తుంచుకోండి’’ అని కంగన ఉద్దవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. తన కార్యాలయాన్ని బీఎంసీ కూల్చివేసిన కొద్ది గంటలకే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్యపైనే కాదు, కశ్మీరీ పండిట్లపైనా కూడా సినిమాలు తీస్తానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. వారు ఎన్ని బాధలు అనుభవించారో ఇప్పుడు అర్థమైందని చెప్పుకోచ్చారు.

ముంబయిలోని పాలీ హిల్స్‌లో ఉన్న కంగన రనౌత్‌ కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించారంటూ బీఎంసీ కూల్చివేత ప్రారంభించింది. ఈ విషయంపై నటి హైకోర్టును ఆశ్రయించగా కూల్చివేతలు నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నటుడు సుశాంత్‌ సింగ్‌ కేసు దర్యాప్తులో ముంబయి పోలీసుల నిర్లక్ష్యం చేస్తున్నారని, ముంబయి మినీ పీవోకేలా మారిందంటూ కంగన గత కొద్దిరోజులుగా బాలీవుడ్ పెద్దలను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తోంది. దీంతో శివసేన నేతలు, కంగన మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకు ప్రాణహాని ఉందని కేంద్రం కంగనకు ‘వై ప్లస్‌’ సెక్యూరిటీని కల్పించింది. అటు ముంబైపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కంగన ఇటీవలే ముంబై చేరుకున్నారు.

.

Follow Us
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్..
కూతురు చదువు, పెళ్లికి ఇక నో టెన్షన్.. కేంద్రం తెచ్చిన..
కూతురు చదువు, పెళ్లికి ఇక నో టెన్షన్.. కేంద్రం తెచ్చిన..
మతం నుంచి అరెస్టుల దాకా.. పీవీ సునీల్‌కు కఠిన ప్రశ్నలు
మతం నుంచి అరెస్టుల దాకా.. పీవీ సునీల్‌కు కఠిన ప్రశ్నలు
వేసవి చర్మానికి అమృతం! పెరుగు–కీరదోస ఫేస్ ప్యాక్‌తో సహజమైన మెరుపు
వేసవి చర్మానికి అమృతం! పెరుగు–కీరదోస ఫేస్ ప్యాక్‌తో సహజమైన మెరుపు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు
టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగోళ్లు..
టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగోళ్లు..
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే
ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?