AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘గూగుల్’ సెర్చ్’లో టాప్‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్!

తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రపంచంలోనే కనివినీ ఎరుగని ఇంజినీరింగ్ అద్భుతం. ఈ ప్రాజెక్ట్ చాలా తక్కువ సమయంలోనే సిద్ధం కావడం ఒక రికార్డు కాగా.. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌(LIS)గా సరికొత్త రికార్డును కూడా సొంతం చేసుకోడానికి సిద్ధమవుతోంది. ఎత్తిపోతల పథకం (లిఫ్ట్ ఇరిగేషన్) అంటే సాధారణ డ్యామ్‌లు నిర్మించినంత ఈజీ కాదు. దీని నిర్మాణం ఎంతో క్లిష్టంగా ఉంటుంది. కొన్ని వందల గ్యాలాన్ల నీటిని నది నుంచి తోడి ఎగువ […]

‘గూగుల్’ సెర్చ్'లో టాప్‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 20, 2019 | 4:39 PM

Share

తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రపంచంలోనే కనివినీ ఎరుగని ఇంజినీరింగ్ అద్భుతం. ఈ ప్రాజెక్ట్ చాలా తక్కువ సమయంలోనే సిద్ధం కావడం ఒక రికార్డు కాగా.. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌(LIS)గా సరికొత్త రికార్డును కూడా సొంతం చేసుకోడానికి సిద్ధమవుతోంది.

ఎత్తిపోతల పథకం (లిఫ్ట్ ఇరిగేషన్) అంటే సాధారణ డ్యామ్‌లు నిర్మించినంత ఈజీ కాదు. దీని నిర్మాణం ఎంతో క్లిష్టంగా ఉంటుంది. కొన్ని వందల గ్యాలాన్ల నీటిని నది నుంచి తోడి ఎగువ ప్రాంతానికి పంపాలంటే భారీ మోటార్లు, పైపులు అవసరం అవుతాయి. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదించిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రీడిజైన్ చేయించారు. ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్‌రావు పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడంతో స్వల్ప కాలంలోనే భారీ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది.

ఇప్పుడు గూగుల్‌లో World’s biggest Lift Irrigation Scheme అని సెర్చ్ చేస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరే వస్తోంది. ఇప్పటి వరకు అమెరికాలోని కొలరాడో, ఈజిప్టులోని గ్రేట్ మ్యాన్ మేడ్ నదిలో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు మాత్రమే ప్రపంచంలో అతి పెద్దవిగా రికార్డు ఉంది. అయితే, కాళేశ్వరమే అతి పెద్ద LIS అనే విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. కాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ‘గూగుల్’ సెర్చ్‌లో అతి పెద్ద LISగా మొదటి స్థానంలో నిలిచింది.