యాంటీ కరప్షన్ పేరుతో ఓ స్వచ్ఛంద సేవా సంస్థ, కట్ చేస్తే అతడే మోసాలకు కేరాఫ్ అడ్రస్ !

చేతిలో కోట్ల విలువైన ప్రాజెక్టు. ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం వహిస్తా. ఒప్పందం కుదిరితే.. ఇంత. డబ్బులు మంజూరైతే మరి కొంత. ఇలా బేరసారాలు చేసి.. ఎదుటి వారిలో నమ్మకాన్ని కల్పించాడు ఓ దుర్మార్గుడు.

యాంటీ కరప్షన్ పేరుతో ఓ స్వచ్ఛంద సేవా సంస్థ, కట్ చేస్తే అతడే మోసాలకు కేరాఫ్ అడ్రస్ !
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 13, 2020 | 8:17 PM

చేతిలో కోట్ల విలువైన ప్రాజెక్టు. ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం వహిస్తా. ఒప్పందం కుదిరితే.. ఇంత. డబ్బులు మంజూరైతే మరి కొంత. ఇలా బేరసారాలు చేసి.. ఎదుటి వారిలో నమ్మకాన్ని కల్పించాడు ఓ దుర్మార్గుడు. లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. దాదాపు 35 లక్షలు దండుకున్నాడు కడప జిల్లా బద్వేల్‌ వాసి. మోసపోయిన వారు ఎవరో కాదు.. ఎక్కడో ఉన్న ఓ ఎన్‌ఆర్‌ఐ. అలస్యంగా తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

ప్రాజెక్టు విలువ 50 కోట్లు. 30 లక్షలు ఇస్తే చాలు ప్రభుత్వాన్ని ఒప్పిస్తానంటూ డబ్బులు దండుకున్నాడు. కడప జిల్లా బద్వేల్‌కి చెందిన మారంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి.. ఎన్ఆర్ఐ రాజేష్ కుమార్ రెడ్డికి తెలిసిన వ్యక్తి. రాజేష్ కుమార్ రెడ్డి.. మామ వెంకట శివారెడ్డికి 50 కోట్ల విలువైన ప్రభుత్వ ప్రాజెక్టును ఇప్పిస్తానని శ్రీకాంత్‌రెడ్డి ఆశ పెట్టాడు. అందుకు గాను 50లక్షల కావాలని ఒప్పందం చేసుకున్నాడు. దశల వారీగా 35 లక్షల వరకు తీసుకున్నాడు. అటు తర్వాత పని అటు కాదు.. ఇటు కాదు.. కొంతకాలానికి అసలు విషయం తెలిసి మోసపోయామని బద్వేలు పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు వెంకటశివారెడ్డి. శ్రీకాంత్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 4 లక్షల 20 వేల నగదు, 3 లక్షల 50 వేల విలువైన బంగారం, 11 లక్షల రూపాయల కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

శ్రీకాంత్ రెడ్డి పీపుల్ అగైనెస్ట్ కరప్షన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. యాంటీ కరప్షన్ పేరుతో ఓ స్వచ్ఛంద సేవా సంస్థను నడుపుతూ తానే చీట్ చేసిన సంగతి స్థానికంగా దుమారం లేపుతోంది. పెద్ద మనుషులగా చెలామణి అవుతూ ఉద్యమాలలో పాల్గొంటూ ఇంత భారీ ఎత్తున మోసానికి తలపడిన శ్రీకాంత్ రెడ్డి విషయం స్థానికంగా సంచలనంగా మారింది. ముఖ్య మంత్రులు మొదలుకొని ఐఎఎస్, ఐపిఎస్, హైకోర్టు న్యాయమూర్తులు లాంటి వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయంటూ.. ఇలాంటి దందాలు చేస్తన్న శ్రీకాంత్‌రెడ్డి.. కొన్ని సంవత్సరాలుగా స్థానికంగా హల్‌చల్‌ చేస్తున్నాడు.

Also Read :

తెలంగాణ : గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ, గవర్నర్ కోటాలో మరో ఇద్దరి పేర్లు ఖరారు !

అదిరి రేంజ్‌లో ‘ఆహా’ వారి దీపావళి సంబరాలు, ముఖ్య అతిథిగా అల్లు అర్జున్

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు