చంద్రబాబుతో సహా.. ఎవ్వరూ నా మాట వినలేదు.. కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తెరపైకి వచ్చారు. ఎన్నికల నిర్వహణ వ్యవస్థలో లోపాలు ఉన్నందున ఈ ఎన్నికలను బహిష్కరించాలని తాను సూచించానని కేఏ పాల్ అన్నారు. ఇందుకోసం కలిసి పోరాడాలని మాయావతి, మమతా, అఖిలేశ్ తదితరులను కోరినా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. అమెరికాలో ఈవీఎంలతో పాటు బ్యాలెట్ విధానం కూడా అమలవుతోందని అన్నారు. భారత్‌లో అలా ఎందుకు చేయరంటూ ప్రశ్నించారు. ఆఖరికి చంద్రబాబు కూడా తన మాటలు పట్టించుకోలేదని, తన దాకా వచ్చేసరికి ఇప్పుడు […]
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తెరపైకి వచ్చారు. ఎన్నికల నిర్వహణ వ్యవస్థలో లోపాలు ఉన్నందున ఈ ఎన్నికలను బహిష్కరించాలని తాను సూచించానని కేఏ పాల్ అన్నారు. ఇందుకోసం కలిసి పోరాడాలని మాయావతి, మమతా, అఖిలేశ్ తదితరులను కోరినా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. అమెరికాలో ఈవీఎంలతో పాటు బ్యాలెట్ విధానం కూడా అమలవుతోందని అన్నారు. భారత్‌లో అలా ఎందుకు చేయరంటూ ప్రశ్నించారు. ఆఖరికి చంద్రబాబు కూడా తన మాటలు పట్టించుకోలేదని, తన దాకా వచ్చేసరికి ఇప్పుడు పోరాటం చేస్తున్నారని అన్నారు.