AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఏంటక్కా ఇది.. టిప్‌టాప్‌గా కారు దిగింది.. ఆ తర్వాత లవర్ కోసం చేయకూడని పని చేసి..

హైదరాబాద్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ప్రియుడికి బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలనే కోరిక ఉంది.. కానీ చేతిలో డబ్బు లేదు.. ప్రియురాలు ఏం చేయాలా అని ఆలోచించి చివరి దొంగతనం చేద్దాం అని ఫిక్స్ అయ్యింది. ప్రేమ కోసం.. ప్రియుడికి గిఫ్ట్ ఇవ్వడానికి ఓ యువతి చేసిన దొంగతనం వ్యవహారం హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Hyderabad: ఏంటక్కా ఇది.. టిప్‌టాప్‌గా కారు దిగింది.. ఆ తర్వాత లవర్ కోసం చేయకూడని పని చేసి..
Hyderabad Crime News
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Apr 15, 2026 | 10:25 AM

Share

హైదరాబాద్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ప్రియుడికి బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలనే కోరిక ఉంది.. కానీ చేతిలో డబ్బు లేదు.. ప్రియురాలు ఏం చేయాలా అని ఆలోచించి చివరి దొంగతనం చేద్దాం అని ఫిక్స్ అయ్యింది. ప్రేమ కోసం.. ప్రియుడికి గిఫ్ట్ ఇవ్వడానికి ఓ యువతి చేసిన దొంగతనం వ్యవహారం హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం పట్టణానికి చెందిన ఓ యువతిపై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ప్రియుడికి ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆమె చేసిన పని చివరకు పోలీసుల చేతికి చిక్కేలా చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి తన ప్రియుడితో కలిసి కారులో జూబ్లీహిల్స్ ప్రాంతానికి వచ్చింది. అనంతరం అతడిని కారులోనే కూర్చోబెట్టి, సమీపంలోని వాచ్ స్టోర్‌లోకి వెళ్లింది. అక్కడ ఖరీదైన టిస్సాట్ బ్రాండ్‌కు చెందిన రెండు వాచీలను చాకచక్యంగా దొంగిలించింది.

ఆ తర్వాత ఆ వాచీలను కొనుగోలు చేసినట్లు నమ్మించి ప్రియుడికి గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ ఘటనపై అనుమానం వచ్చిన స్టోర్ నిర్వాహకులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. దొంగతనం చేసిన దృశ్యాలు స్పష్టంగా కనిపించడంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టి యువతిని గుర్తించారు. ఆమెతో పాటు ఈ ఘటనలో సహకరించిన ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరినీ అరెస్ట్ చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us