షో ఆఫ్ అపోజిషన్ యూనిటీ… ఝార్ఖండ్ పీఠంపై హేమంత్ సొరేన్
చాలా కాలం తరువాత దేశంలో ప్రతిపక్షాల ‘ సమైక్యత ‘ కనిపించింది. ఝార్ఖండ్ రాష్ట్ర 11 వ ముఖ్యమంత్రిగా జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సొరేన్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ద్రౌపది ముర్ము హేమంత్ చేత ప్రమాణం చేయించారు. ఆయన ఈ రాష్ట్ర సీఎం గా పదవి చేపట్టడం ఇది రెండో సారి. హేమంత్ తో బాటు మరో ఇద్దరు సభ్యులు మంత్రులుగా […]

చాలా కాలం తరువాత దేశంలో ప్రతిపక్షాల ‘ సమైక్యత ‘ కనిపించింది. ఝార్ఖండ్ రాష్ట్ర 11 వ ముఖ్యమంత్రిగా జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సొరేన్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ద్రౌపది ముర్ము హేమంత్ చేత ప్రమాణం చేయించారు. ఆయన ఈ రాష్ట్ర సీఎం గా పదవి చేపట్టడం ఇది రెండో సారి. హేమంత్ తో బాటు మరో ఇద్దరు సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాఘేల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, డీఎంకె అధినేత స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సీపీఎం, సీపీఐ నేతలు సీతారాం ఏచూరి, డి. రాజా. లోక్ తాంత్రిక్ జనతాదళ్ నాయకుడు శరద్ యాదవ్ తదితరులంతా హాజరయ్యారు. మాజీ సీఎం, బీజేపీ నేత రఘువర్ దాస్ కూడా ఈ ఈవెంట్ కు హాజరు కావడం విశేషం. రాష్ట్రంలో ఓ కొత్త శకానికి నాంది పలుకుతున్న ‘ సంకల్ప్ దివస్ ‘ గా ఈ రోజును నేతలు అభివర్ణించారు. అంతకు ముందు ఈ ఉదయం హేమంత్ సొరేన్.. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరు కావాలని ప్రజలను కోరుతూ ట్వీట్ చేశారు. ఇది చరిత్రాత్మక ఘటన అని పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి 47 సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. (రాష్ట్ర అసెంబ్లీలో 81 మంది సభ్యులున్నారు). హేమంత్ సొరేన్ మళ్ళీ ఝార్ఖండ్ సీఎం గా అధికార పగ్గాలు చేబట్టడానికి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, టాటా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌తో బాటు క్రియేటివ్ సోషల్ మీడియా కూడా ఎంతగానో కృషి చేశాయి.
Jharkhand Mukti Morcha leader Hemant Soren took oath as the 11th Chief Minister of #Jharkhand. Governor Draupadi Murmu administered the oath of office and secrecy to Mr Soren at Morhabadi grounds in Ranchi. pic.twitter.com/dadeSmNkia
— All India Radio News (@airnewsalerts) December 29, 2019
I attended the swearing in ceremony of CM Hemant Soren Ji & ministers from the Congress party in Ranchi today. I’m confident that the new Govt in Jharkhand will work for the benefit of all citizens & usher in an era of peace & prosperity in the state. pic.twitter.com/nIg1svJ0uL
— Rahul Gandhi (@RahulGandhi) December 29, 2019