AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జియో మరో బంపర్ ఆఫర్.. దుబాయ్, అమెరికాలోను రోమింగ్ ఫ్రీ

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ తో ముందుకు వచ్చింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ధన్ ధనా ధన్ పేరుతో కొత్త ఫ్లాన్ ను తీసుకువచ్చింది.

జియో మరో బంపర్ ఆఫర్.. దుబాయ్, అమెరికాలోను రోమింగ్ ఫ్రీ
Balaraju Goud
|

Updated on: Sep 22, 2020 | 6:03 PM

Share

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ తో ముందుకు వచ్చింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ధన్ ధనా ధన్ పేరుతో కొత్త ఫ్లాన్ ను తీసుకువచ్చింది. పోస్ట్‌పెయిడ్ సేవల విభాగాన్ని మార్చే ప్రయత్నంలో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో భారతదేశంలో పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ఎన్నడూ వినని ప్రయోజనాలతో జియో పోస్ట్‌పెయిడ్ ఫ్లస్ ను పరిచయం చేస్తోంది. ముఖ్యంగా కొత్తగా ప్రారంభించిన జియో పోస్ట్‌పెయిడ్ ఫ్లస్ సేవలు లక్ష్యం దేశమంతా కనెక్టివిటీ, వినోదం, అనుభవంతో కూడిన ఉన్నత సేవలు అందించడమని రిలయన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. విదేశాలలో ప్రయాణించే భారతీయయుల కోసం మొట్టమొదటి-ఇన్ ఫ్లైట్ కనెక్టివిటీని ప్రవేశపెట్టింది జియో. యూ‌ఎస్‌ఏతో పాటు యూ‌ఏ‌ఈలో ఫ్రీ ఇంటర్నేషనల్ రోమింగ్ వినియోగించుకునే కొత్త అఫర్ ను తీసుకువచ్చింది. ఇంటర్నేషనల్ కాలింగ్ (ఐ‌ఎస్‌డి) ప్రతి నిమిషానికి 50పైసలతో ప్రారంభం కానున్న కొత్త ఫ్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ పోస్ట్‌పెయిడ్ సర్వీస్ గురించి జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ “జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ను ప్రారంభించడం ఇదే సరియైన సమయం భావిస్తున్నామని.. 400 మిలియన్ల జియో వినియోగదారుల నమ్మకం సంపాదించిన తరువాత ప్రీపెయిడ్ విభాగాన్ని విస్తరించాలనుకుంటున్నామన్నారు. ప్రతి పోస్ట్‌పెయిడ్ కస్టమర్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమ్మకమైన, అధిక నాణ్యత కనెక్టివిటీ, ఆన్ లిమిటెడ్ ప్రీమియం వినోదం, అంతర్జాతీయ రోమింగ్, అత్యాధునిక ఫీచర్స్, చాలా ముఖ్యంగా కస్టమర్ అనుభవం కోసం జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ రూపొందించబడిందన్నారు. మేము భారతదేశంలోని ప్రతి పోస్ట్‌పెయిడ్ వినియోగదారుడు దీనిని పూర్తిగా ఉపయోగించుకుంటారని మేము ఆశిస్తున్నామని అన్నారు….

జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లుః

ఎంటర్టైన్మెంట్ ప్లస్ః – నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ & డిస్నీ + హాట్‌స్టార్‌కు సబ్‌స్క్రిప్షన్ – 650+ లైవ్ టీవీ ఛానెల్స్, వీడియో కంటెంట్, 5 సిఆర్ సాంగ్స్, 300+ న్యూస్‌పేపర్‌లతో జియో యాప్

ఫీచర్స్ ప్లస్ః – రూ.250 తో పూర్తి కుటుంబానికి ఉపయోగపడే ఫ్యామిలి ప్లాన్ . – 500 జిబి వరకు డేటా రోలవర్. – భారతదేశంతో పాటు విదేశాలలో వైఫై-కాలింగ్.

ఇంటర్నేషనల్ ప్లస్ః – విదేశాలలో ప్రయాణించే భారతీయయుల కోసం మొట్టమొదటి-ఇన్ ఫ్లైట్ కనెక్టివిటీ. – యూ‌ఎస్‌ఏ & యూ‌ఏ‌ఈలో ఫ్రీ ఇంటర్నేషనల్ రోమింగ్. – ఇంటర్నేషనల్ కాలింగ్ (ఐ‌ఎస్‌డి) ప్రతి నిమిషానికి 50పైసలు వద్ద ప్రారంభమవుతుంది.

జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ప్రపంచ స్థాయి ఆల్-ఐపి డేటాను బలంగా నిర్మించింది. ఇది సరికొత్త 4జి ఎల్‌టిఇ టెక్నాలజీ నెట్‌వర్క్. వాయిస్ ఓవర్ ఎల్‌టిఇ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఇది భవిష్యత్తులో 5జి, 6జి లేదా అంతకు మించి టెక్నాలజికి సులభంగా అప్‌గ్రేడ్ చేయడానికి వీలవుతుందని రిలయన్స్ సంస్థ పేర్కొంది. ప్రతి ఒక్కరూ జియో డిజిటల్ లైఫ్ ఆనందించడానికి కస్టమర్ ఆఫర్లలో భాగంగా జియో ఇండియన్ టెలికాంలో విప్లవాత్మక మార్పులు చేసింది. భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన, సరసమైన డేటా మార్కెట్‌గా చేస్తుందని రిలయన్స్ జియో వెల్లడించింది.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు