AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్.. బాడీ టైప్‌ను బట్టి ఎవరికి ఏది మంచిది

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో వచ్చే చిట్కాలను జనాలు గుడ్డిగా ఫాలో అవుతున్నారు. వాటిలో ముఖ్యంగా మార్నింగ్ ఖాళీ కడుపుతో జీలకర్ర, వాము లేదా మెంతుల నీరు తాగడం. అయితే ఈ మూడు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉన్నాప్పటికీ.. ఎప్పుడు, ఎవరు ఏ డ్రింక్‌ను తాగుతున్నారనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకుంటే అన్ని డ్రింక్స్ అందిరికీ ఒకేలా పనిచేయవు. తప్పుడు డ్రింక్‌ను ఎంచుకుంటే ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీ బాడీ టైప్, కడుపు సమస్యలను బట్టి ఏ నీరు ఉత్తమమో ఇక్కడ తెలుసుకుందాం.

జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్.. బాడీ టైప్‌ను బట్టి ఎవరికి ఏది మంచిది
Jeera, Ajwain, Or Methi Water
Anand T
|

Updated on: Jun 10, 2026 | 9:36 PM

Share

ఈ మధ్య చాలా మంది బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తారు. అందుకోసం సోషల్‌ మీడియాలో వచ్చే చిట్కాలను చూసి ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర, వాము లేదా మెంతుల నీటిని తాగడం అలవాటు చేసుకుంటున్నారు. మీడియాలో వీటిని వెయిట్ లాస్, మ్యాజికల్ డిటాక్స్ డ్రింక్స్‌గా బాగా ప్రమోట్ చేస్తున్నారు. కానీ, నిపుణుల మాత్రం ఇవి అందరికీ ఒకేలా పని చేయవని చెబుతున్నారు. ఒక్కొక్కరి శరీరంపై ఒక్కో డ్రింక్ ప్రభావం ఒక్కోలా ఉంటుందని చెబుతున్నారు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏది మంచిదో బెంగళూరులోని కిమ్స్ (KIMS) హాస్పిటల్ సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ బాలాజీ ప్రకారం తెలుసుకుందాం.

జీలకర్ర నీరు.. ఎవరు ఎప్పుడు తాగడం మంచిది?

జీలకర్ర నీరు జీర్ణక్రియకు అత్యంత సురక్షితమైన, ప్రభావవంతమై పానియం. ఇది కడుపులో జీర్ణ ఎంజైములు, బైల్ స్రావాన్ని పెంచుతుంది, దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా కడుపు బరువుగా అనిపించే వారికి ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగడం ఉత్తమమైన ఆప్షన్.

వామును నీరు వీళ్లకు అస్సలు మంచిది కాదు

వాము నీటిలో థైమోల్ అనే యాక్టివ్ కాంపౌండ్ ఉంటుంది. ఇది కడుపు నొప్పి, కడుపు తిప్పడం, అకస్మాత్తుగా వచ్చే అజీర్ణం నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే, వాము నీరు చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని డాక్టర్ హెచ్చరిస్తున్నారు. యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రైటిస్ సమస్య ఉన్నవారు దీనిని రోజూ తీసుకోకూడదంటున్నారు. ఎందుకంటే ఇది ఎసిడిటీని మరింత పెంచుతుందని చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు వాము నీటికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తుంది. దీనిని కేవలం ఎప్పుడైనా ఒక మందులా మాత్రమే వాడాలని సూచిస్తున్నారు.

మెంతుల నీరు ఎవరికి ప్రయోజనకరం?

మెంతుల నీరు మెటబాలిజం, బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెంతులలో ఉండే సాల్యుబుల్ ఫైబర్ ప్రేగులలో కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదింపజేస్తుంది. ప్రీ-డయాబెటిస్, టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగులకు ఇది ఎంతో మంచిది. అలాగే, దీర్ఘకాలిక మలబద్ధకం, మందగించిన జీర్ణక్రియ ఉన్నవారికి కూడా ఇది బాగా పని చేస్తుంది

వైద్యుల సలహాతోనే తీసుకోండి?

అయితే మెంతుల స్వభావం వేడి చేసేదిగా ఉంటుంది. అలాగే రుచికి కూడా చేదుగా ఉంటుంది. దీనిని ఎక్కువగా తాగడం వల్ల విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, డయాబెటిస్ మందులు వాడుతున్న వారు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే దీనిని తాగడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us