ఆక‌ట్టుకుంటోన్న జాన్వీ ‘గుంజన్ స‌క్సేనా’ మూవీ ట్రైల‌ర్..

బాలీవుడ్ న‌టి జాన్వీ కపూర్ యుద్ధ పైల‌ట్‌గా న‌టిస్తున్న చిత్రం 'గుంజ‌న్ స‌క్సేనాః ది కార్గిల్ గ‌ర్ల్'.  కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న లైడీ పైలెట్‌గా కార్గిల్ గ‌ర్ల్‌గా ఖ్యాతిగ‌డించిన.. గుంజ‌న్ స‌క్సేనా జీవితం ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కించారు. ఇందులో జాన్వీ ప్ర‌ధాన పాత్ర‌లో..

ఆక‌ట్టుకుంటోన్న జాన్వీ 'గుంజన్ స‌క్సేనా' మూవీ ట్రైల‌ర్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 01, 2020 | 2:02 PM

బాలీవుడ్ న‌టి జాన్వీ కపూర్ యుద్ధ పైల‌ట్‌గా న‌టిస్తున్న చిత్రం ‘గుంజ‌న్ స‌క్సేనాః ది కార్గిల్ గ‌ర్ల్’.  కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న లైడీ పైలెట్‌గా కార్గిల్ గ‌ర్ల్‌గా ఖ్యాతిగ‌డించిన.. గుంజ‌న్ స‌క్సేనా జీవితం ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కించారు. ఇందులో జాన్వీ ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తోంది. ఈ సినిమాలో జాన్వీ చాలా ప్రొఫెష‌న‌ల్‌గా క‌నిపిస్తోంది.‌ ఈ చిత్రానికి శ‌ర‌ణ్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. క‌ర‌ణ్ జోహార్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్-జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ బ‌యోపిక్‌కి సంబంధించి ట్రైల‌ర్ విడుద‌ల చేసింది మూవీ యూనిట్‌. ఇక ఆగ‌ష్టు 12న ప్ర‌ముఖ డిజిట‌ల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్‌లో విడుద‌ల అవుతుంది ఈ సినిమా.

ఇక ‘గుంజ‌న్ స‌క్సేనాః ది కార్గిల్ గ‌ర్ల్’ ట్రైల‌ర్ ఆద్యంతం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఇక ప్ర‌ముఖ న‌టుడు పంకజ్ త్రిపాఠి ఇందులో జాన్వీ తండ్రిగా న‌టించారు. కూతురు వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించే తండ్రిగా ఆయ‌న ఇందులో క‌నిపిస్తారు.’ ఒక స్త్రీ లేదా పురుషుడు విమానం న‌డుపుతుంటే వారిని పైలెట్ అనే పిలుస్తారు అని ఆయ‌న చెప్పే డైలాగ్ ఎంతో భావోద్వేగానికి’ గురి చేస్తుంది. ‘ఒక లేడీ పైలెట్‌కి స‌రైన టాయిలెట్స్ లేపోవ‌డం.. అబ్బాయిల‌తో ధీటుగా ఎన‌ర్జీ మేయింటైన్ చేయాల‌ని.. కించ‌ప‌ర‌చ‌డం లాంటివి ఈ ట్రైల‌ర్‌లో చూపించారు’. మొత్తం మీద గుంజ‌న్ స‌క్సేనా.. ఒక పైలెట్ కావ‌డానికి ఎన్ని కష్టాలు ప‌డాల్సి వ‌చ్చిందో.. అన్నింటినీ ఈ సినిమాలో చూపించ‌బోతున్నారు ద‌ర్శ‌కుడు శ‌ర‌ణ్ శ‌ర్మ‌.

Read More:

ఇక‌పై ప్ర‌భుత్వ ఉద్యోగులు టీ ష‌ర్ట్స్‌, జీన్స్ ధ‌రించ‌డం నిషేధం!

ప్ర‌పంచ వ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి