AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

#COVID19 క్రమంగా కరోనా కేసులు తగ్గే అవకాశం.. ఏపీ అధికారుల తాజా విశ్లేషణ

ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతుందని అధికారులు అంఛనా వేస్తున్నారు. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నివేదించారు అధికారులు. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసులపై ముఖ్యమంత్రికి వివరాలు అందజేశారు.

#COVID19 క్రమంగా కరోనా కేసులు తగ్గే అవకాశం.. ఏపీ అధికారుల తాజా విశ్లేషణ
Rajesh Sharma
|

Updated on: Apr 07, 2020 | 2:57 PM

Share

AP official team expect corona cases come down: ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతుందని అధికారులు అంఛనా వేస్తున్నారు. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంగళవారం నివేదించారు అధికారులు. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసులపై ముఖ్యమంత్రికి వివరాలు అందజేశారు. సోమవారం (ఏప్రిల్ 6) సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం (ఏప్రిల్ 7) ఉదయం వరకు మొత్తం 150 కోవిడ్‌ నిర్దారణ పరీక్షలు నిర్వహించామని, అందులో కేవలం ఒకటే పాజిటివ్ కేసు నమోదైందని అధికారులు వివరించారు. ఈ లెక్కన రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా తగ్గవచ్చని వారు అంఛనా వేస్తున్నారు.

ఢిల్లీ నుంచి వచ్చిన వారికి, వారి ప్రైమరీ కాంటాక్టులకు దాదాపు పరీక్షలు పూర్తయ్యాయని వెల్లడించిన అధికారులు.. క్రమంగా కేసుల సంఖ్య తగ్గవచ్చని చెబుతున్నారు. హాట్‌స్పాట్లు, కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన వారితోపాటు ర్యాండమ్‌ పరీక్షలపై దృష్టి సారించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వారు, వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌కు పరీక్షలు పూర్తయిన తర్వాత ఎవరెవరికి పరీక్షలు నిర్వహించాలన్న దానిపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో చర్చించారు.

కుటుంబ సర్వే ద్వారా జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి లాంటి ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్నవారిని గుర్తించి వారికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ర్యాండమ్‌ సర్వేపైన కూడా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. వైజాగ్‌లో నిర్వహించిన పద్ధతిలో ర్యాండమ్ సర్వేలు జరపాలని సీఎం నిర్దేశించారు.

వసతులు, సదుపాయాల మెరుగుపై దృష్టి

క్వారంటైన్లు, క్యాంపుల్లో ఉన్న సదుపాయాలు, వసతులను పెంచడంపై ప్రధానంగా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ క్వారంటైన్లలో సుమారు 5300కుపైగా ప్రజలున్నారని, విదేశాలనుంచి వచ్చిన వారిలో ఇంకా హోం క్వారంటైన్‌లో ఉన్నవారు 19 వేల 247 కాగా వారందరినీ ప్రత్యేక యాప్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. లక్ష మంది వరకూ హోం క్వారంటైన్‌లో వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు పర్యవేక్షణలో ఉన్నారని, సిబ్బంది ఎప్పటికప్పుడు వీరిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

కోవిడ్‌ ఆస్పత్రుల సన్నద్ధతపై దృష్టి

క్రిటికల్‌ కేర్‌ కోసం నిర్దేశించిన కోవిడ్‌ ఆస్పత్రులు, అలాగే జిల్లాల వారిగా నిర్దేశించుకున్న కోవిడ్‌ ఆస్పత్రుల సన్నద్ధతపైనా దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ ఆస్పత్రుల్లో సదుపాయాల్లో నాణ్యత ఉండాలని, రూపొందించుకున్న ఎస్‌ఓపీ ప్రకారం ప్రమాణాలు పాటించాలని, వచ్చే సోమవారం నాటికి అనుకున్న ప్రమాణాల ప్రకారం వీటన్నింటిలోనూ వసతులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు.

వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్‌పై సమీక్ష:

వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయని, రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ప్రతిరోజూ కనీసం 150 ట్రక్కుల వరకూ అరటిని ఎగుమతిచేస్తున్నామని, మరోవైపు మార్కెటింగ్‌ శాఖ కూడా కొనుగోలుచేసి స్థానిక మార్కెట్లకు సరఫరా చేస్తున్నామని అధికారులు వివరించారు. టమోటా దిగుమతులు క్రమంగా తగ్గుతున్నందున మార్కెట్లోనే అమ్ముడు పోతోందని, ఈ పంట విక్రయం విషయంలో సమస్యలు తొలగిపోయాయని చెబుతున్నారు అధికారులు.