AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూగ జీవాలకు హెల్త్ కార్డులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

ఏపీ సీఎం వైఎస్ జగన్ పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనను ముందుకు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

మూగ జీవాలకు హెల్త్ కార్డులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
Ravi Kiran
|

Updated on: Jun 24, 2020 | 2:09 PM

Share

ఏపీ సీఎం వైఎస్ జగన్ పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనను ముందుకు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ‘వైఎస్సార్ పశు సంరక్షణ పధకానికి శ్రీకారం చుట్టారు. ఈ పధకం ద్వారా పశువులు కలిగిన రైతులు. గొర్రెల, మేకల కాపరులు, యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవనుంది.

మూగజీవులకు హెల్త్ కార్డులను జారీ చేసి.. వాటి సంరక్షణను చూసుకోనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పశువైద్య సహాయకులను అందుబాటులో ఉంచనున్నారు. అంతేకాకుండా సమస్యలు పరిష్కారం కోసం పశుసవర్ధకశాఖ టోల్ ఫ్రీ నెంబర్ 085-00-00–1962, లేదా రైతు భరోసా కేంద్రాల టోల్‌ఫ్రీ నెంబర్ 1907కు కాల్‌ చేయాలని సూచించారు.

వైఎస్ఆర్ పశునష్టపరిహర పధకం వివరాలు ఇలా ఉన్నాయి..

  • ఈ పథకం పునరుత్పాదక దశలో 2 నుంచి 10 ఏళ్లు వయసున్న ఆవులను, 3 నుంచి 12 ఏళ్లు వయసున్న బర్రెలను వర్తింపజేస్తారు.
  • పశువులు మరణిస్తే.. మేలుజాతి స్వదేశీ ఆవుకు రూ. 30 వేలు పరిహారం… దేశవాళీ బర్రె మరణిస్తే రూ. 15 వేలు పరిహారాన్ని అందించనున్నారు.
  • ఏడాదికి ఒక కుటుంబం గరిష్టంగా రూ. 1.50 లక్షలు పరిహారం పొందే అవకాశం ఉంది.
  • ఆరు నెలలు ఆపై వయసున్న గొర్రెలు, మేకలను ఈ పధకం కిందకు వర్తింపజేశారు.
  • ఒకేసారి మూడు కంటే ఎక్కువ సంఖ్యలో మూగజీవాలు మరణిస్తే.. ఈ పధకాన్ని అందిస్తారు.