ట్రంప్ ట్వీట్ ‘దాచిపెట్టిన’ ట్విటర్.. ఎందుకంటే..?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ ట్వీట్ ను ట్విటర్ 'దాచిపెట్టింది'. ఇది ద్వేషపూరితమైన కంటెంట్ అని, తమ నిబంధనలను ఉల్లంఘించేదిగా ఉందని పేర్కొంది. వాషింగ్టన్ లో ఆందోళన చేస్తున్న నిరసనకారులను ఉద్దేశించి..

  • Umakanth Rao
  • Publish Date - 1:56 pm, Wed, 24 June 20
ట్రంప్ ట్వీట్ 'దాచిపెట్టిన' ట్విటర్.. ఎందుకంటే..?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ ట్వీట్ ను ట్విటర్ ‘దాచిపెట్టింది’. ఇది ద్వేషపూరితమైన కంటెంట్ అని, తమ నిబంధనలను ఉల్లంఘించేదిగా ఉందని పేర్కొంది. వాషింగ్టన్ లో ఆందోళన చేస్తున్న నిరసనకారులను ఉద్దేశించి.. తాను ఈ దేశాధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఈ నగరం మీ అదుపులో ఉన్న ప్రాంతంగా ఉండబోదని, మీరిలాగే ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. అయితే ఇది ఆందోళనకారులను రెచ్ఛగొట్టేదిగా ఉందని, అబ్యూసివ్ బిహేవియర్ ని ఖండించాలన్న తమ పాలసీకి విరుధ్ధంగా ఉందని ట్విటర్ పేర్కొంది.ట్రంప్ ప్రభుత్వానికి, సోషల్ మీడియా వేదికలకు మధ్య తలెత్తిన విభేదాలను ఈ తాజాపరిణామం మరింత రాజుకునేలా చేసింది. తమకు ట్విటర్, ఫేస్ బుక్ వంటి సాధనాల నుంచి ఎలాంటి ‘ముప్పు’ రాకుండా,, తాము చెప్పిందే వేదమన్నట్టు ఎలాంటి కంటెంట్ పెట్టినా అది చెల్లుబాటయ్యేలా ఓ చట్టం తేవాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. అయితే అలాంటి చట్టమే వస్తే దాన్ని కోర్టులో ఎదుర్కొనేందుకు ఈ సామాజిక మాధ్యమాలన్నీ రెడీగా ఉన్నాయి.