AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతడికి అదృష్టం రెండుసార్లు తలుపుతట్టింది…!

నాన్న ఇచ్చిన నాణెం మాత్రం మార్క్‌ క్లార్క్‌కు కోట్లు తెచ్చిపెట్టింది... అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన వ్యక్తి ఓ లాటరీ టికెట్‌ కొన్నాడు.. పదేళ్ల కిందట చనిపోయిన తన తండ్రి ఇచ్చిన నాణెంతో గీకి చూశాడు. నాలుగు మిలియన్‌ డాలర్ల లాటరీ తగిలింది.

అతడికి అదృష్టం రెండుసార్లు తలుపుతట్టింది...!
Balu
|

Updated on: Jun 23, 2020 | 3:59 PM

Share

నక్కతోక తొక్కితే లక్కు లటుక్కుమని పట్టేస్తుంది. అదేమోగానీ నాన్న ఇచ్చిన నాణెం మాత్రం మార్క్‌ క్లార్క్‌కు కోట్లు తెచ్చిపెట్టింది… మార్క్‌ క్లార్క్‌ ఎవరంటే.. అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన వ్యక్తి…ఇతగాడు ఏం చేశాడంటే మూడేళ్ల కిందట ఓ లాటరీ టికెట్‌ కొన్నాడు..ఆ టికెట్‌కు లాటరీ తగిలిందో లేదో మొన్న చెక్‌ చేసుకున్నాడు.. అది కూడా పదేళ్ల కిందట చనిపోయిన తన తండ్రి ఇచ్చిన నాణెంతో గీకి చూశాడు.. అంతే కళ్లు తిరిగి పడినంత పనైంది మార్క్‌ క్లార్క్‌కు… ఆ టికెట్‌కే లాటరీ తగిలింది.. గెల్చుకున్న సొమ్ము ఒకటో రెండో లక్షలు కాదు.. . అక్షరాల నాలుగు మిలియన్‌ డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే 30 కోట్ల రూపాయలు.. అన్నట్టు మనవాడు లాటరీ గెలవడం ఇది రెండోసారి.. లాటరీ నిర్వాహకులు మార్క్‌ క్లార్క్‌కు రెండు ఆప్షన్లు ఇచ్చారు.. లాంగ్‌ టర్మ్‌లో నాలుగు మిలియన్‌ డాలర్లు కావాలో.. లేకపోతే వెంటనే రెండున్నర మిలియన్‌ డాలర్లు కావాలో డిసైడ్‌ చేసుకోమన్నారు.. అప్పటి వరకు వేచి ఉండటం నా వల్ల కాదు కానీ.. ఇప్పుడే ఇచ్చేయండి పట్టుకెళ్లిపోతానన్నాడు క్లార్క్‌.. సరే అలాగేనన్నారు నిర్వాహకులు.. ఎంచక్కా 19 కోట్ల రూపాయలు పట్టుకెళ్లిపోయాడు.. తాను ఇంత పెద్ద మొత్తం అమౌంట్‌ గెల్చుకోడానికి కారణం తండ్రి ఇచ్చిన కాయినేనని సంబరంగా చెప్పుకొచ్చాడు క్లార్క్‌..

Follow Us
విక్రమ్ 1.. ప్రధాని మోదీ చేతిరాత కార్డ్‌తో నింగిలోకి..!
విక్రమ్ 1.. ప్రధాని మోదీ చేతిరాత కార్డ్‌తో నింగిలోకి..!
గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి.. చేతులు వణుకుడు కూడా
గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి.. చేతులు వణుకుడు కూడా
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!
గోదావరి నదిలో ఇసుక నుంచి బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం..
గోదావరి నదిలో ఇసుక నుంచి బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం..