విషాదం: ఫ్లెక్సీ కడుతూ వైఎస్ జగన్ స్నేహితుడు మృతి..!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తమకున్న అభిమానాన్ని చాటుకోవాలన్న తాపత్రయంలో ఇద్దరు వైఎసార్‌సీపీ అభిమానులు మృత్యువాతపడ్డారు. అందులో ఒకరు సీఎం చిన్ననాటి స్నేహితుడు. ఆయన చిన్నప్పుడు జగన్‌తో కలిసి దిగిన ఫోటోలను, పాదయాత్రలో కలిసి తీయించుకున్న ఫోటోలను కలిపి ఫ్లెక్సీలుగా...

  • Ravi Kiran
  • Publish Date - 1:26 pm, Fri, 28 February 20
విషాదం: ఫ్లెక్సీ కడుతూ వైఎస్ జగన్ స్నేహితుడు మృతి..!

Jagan Childhood Friend: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తమకున్న అభిమానాన్ని చాటుకోవాలన్న తాపత్రయంలో ఇద్దరు వైఎసార్‌సీపీ అభిమానులు మృత్యువాతపడ్డారు. అందులో ఒకరు సీఎం చిన్ననాటి స్నేహితుడు. ఆయన చిన్నప్పుడు జగన్‌తో కలిసి దిగిన ఫోటోలను, పాదయాత్రలో కలిసి తీయించుకున్న ఫోటోలను కలిపి ఫ్లెక్సీలుగా తయారు చేసి తన ఇంటి ముందు కట్టే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు.

విశాఖపట్నంలోని అనకాపల్లికి చెందిన ఏడిద జగదీష్(39), ముప్పిడి శ్రీను(42)లు వైసీపీ అభిమానులు. అంతేకాకుండా జగదీష్ తన చిన్నప్పుడు జగన్‌తో కలిసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆయన మీద అభిమానంతో అప్పట్లో దిగిన ఫోటోలను, పాదయాత్రలో పాల్గొన్న చిత్రాలను కలిపి ఓ భారీ ఫ్లెక్సీగా తయారు చేయించి తన ఇంటి ముందు పెట్టాలనుకున్నారు.

ఈ క్రమంలోనే దాన్ని కట్టేందుకు పైకి ఎక్కగా.. గాలి బాగా వీయడంతో ఆ ఫ్లెక్సీ పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై పడింది. దానితో ఆ ఇద్దరికి షాక్‌ తగిలింది. వారిని స్థానికులు హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించినా అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో ఇరువురూ ప్రాణాలు విడిచారు.

For More News:

వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. బిల్లు చెల్లించకపోతే ఆటోమేటిక్‌గా పవర్ కట్..!

జగన్ మరో సంచలనం.. ఇక నుంచి ప్రజాసేవలో మంత్రులు కూడా..

బుమ్రాపై వేటు.. ఆ ఇద్దరికీ ఛాన్సు.. కోహ్లీ ఆలోచన సరైనదేనా.?

ఇదెక్కడి విచిత్రమో! అమలాపురం స్కూల్‌లో స్టూడెంట్స్ అందరూ కవలలే..

కిక్కిచ్చే వార్త.. లేడీస్ కోసం ప్రత్యేక మద్యం షాపులు..!