వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. బిల్లు చెల్లించకపోతే ఆటోమేటిక్‌గా పవర్ కట్..!
విద్యుత్ వినియోగదారులకు ఇది షాకింగ్ న్యూస్. ఇకపై కరెంట్ బిల్లును చెల్లించకపోతే ఆటోమేటిక్‌గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ప్రభుత్వ స్మార్ట్ మీటర్ జాతీయ కార్యక్రమం'లో భాగంగా సుమారు 10 లక్షల స్మార్ట్ మీటర్లను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆర్‌కె సింగ్ వెల్లడించారు.

Smart Meter Of Electricity: విద్యుత్ వినియోగదారులకు ఇది షాకింగ్ న్యూస్. అయితే క్రమం తప్పకుండా బిల్లును సకాలంలో కట్టేవారు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అసలు విషయం ఏంటంటే. ఇకపై కరెంట్ బిల్లును చెల్లించకపోతే ఆటోమేటిక్‌గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. త్వరలోనే దేశమంతటా స్మార్ట్ మీటర్లను అమర్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ‘ప్రభుత్వ స్మార్ట్ మీటర్ జాతీయ కార్యక్రమం’లో భాగంగా సుమారు 10 లక్షల స్మార్ట్ మీటర్లను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆర్‌కె సింగ్ వెల్లడించారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, బీహార్ నగరాల్లో స్మార్ట్ విద్యుత్ మీటర్లను అమర్చామని.. దేశవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
పని చేసే విధానం…
ఈ స్మార్ట్ మీటర్లను అమర్చిన తర్వాత సకాలంలో కరెంటు బిల్లును చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ జమ చేయకపోతే ఆటోమేటిక్‌గా పవర్ నిలిచిపోతుంది. ఎప్పుడయితే మీరు బిల్లును కడతారో అప్పుడే మళ్ళీ ఇంటికి కరెంట్ సప్లయ్ అవుతుంది. ఇక ఈ ప్రక్రియ అంతా కూడా ఏ లైన్‌మాన్ సహాయం లేకుండా జరుగుతుంది.
మన మొబైల్స్‌లో పోస్ట్‌పెయిడ్, ప్రీ-పెయిడ్ సర్వీసెస్ మాదిరిగానే ఇందులోనూ ఉంటాయి. రూ.50 నుంచి వినియోగదారులు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువగా రీఛార్జ్ చేసుకుంటే.. అంత ఎక్కువ కాలం విద్యుత్ అందుతుంది. అంతేకాకుండా విద్యుత్‌ను ఆదాయం చేసుకునేందుకు ఈ స్మార్ట్ మీటర్లను స్విచ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. మనం చేయాల్సిన పేమెంట్.. వాయిదాలు గానీ.. ఒకేసారి అయినా మొత్తంగా చెల్లించవచ్చు.
స్మార్ట్ మీటర్ వల్ల ప్రయోజనాలు ఏంటి..?
మనం ఇంట్లో వినియోగించే విద్యుత్ కంటే అధిక లోడ్ ఉంటే.. వెంటనే విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. ఆ లోడ్ అంతా నియంత్రణలోకి వచ్చిన తర్వాతే మళ్ళీ సప్లయ్ తిరిగి స్టార్ట్ అవుతుంది. అంతేకాక ఓవర్ లోడ్ కూడా కాదు. ఏ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఎంత విద్యుత్ వస్తోంది.. అది ఎక్కడ వినియోగించబడింది అనే అంశాలు అన్నీ కూడా ఎనర్జీ ఆడిట్‌లో ఉంటాయి.
For More News:
కిక్కిచ్చే వార్త.. లేడీస్ కోసం ప్రత్యేక మద్యం షాపులు..!
నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్…
జగన్ మరో సంచలనం.. ఇక నుంచి ప్రజాసేవలో మంత్రులు కూడా..
విషాదం: ఫ్లెక్సీ కడుతూ వైఎస్ జగన్ స్నేహితుడు మృతి..!
ఇదెక్కడి విచిత్రమో! అమలాపురం స్కూల్‌లో స్టూడెంట్స్ అందరూ కవలలే..