రాజధాని బదిలీకి వ్యతిరేకంగా.. జేఏసీ నిరసనలు

రాజధాని నగరాన్ని విశాఖపట్నానికి మార్చాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా అమరావతి పరిరక్షణ సమితి, సంయుక్త కార్యాచరణ కమిటీ సభ్యులు మంగళవారం నిరసనను కొనసాగించారు. ధర్నా చౌక్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలో టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు, ఎంఎల్‌సి అశోక్ బాబు, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. అమరావతి రైతుల నిరసనకు తమ సంఘీభావం తెలిపారు. జెఎసి కన్వీనర్ శివారెడ్డి, గడ్డే తిరుపతి రావు, ఆర్‌వి స్వామి, కె రాజేంద్ర, గడ్డే రాజలింగం, వై […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:49 am, Wed, 1 January 20
రాజధాని బదిలీకి వ్యతిరేకంగా.. జేఏసీ నిరసనలు

రాజధాని నగరాన్ని విశాఖపట్నానికి మార్చాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా అమరావతి పరిరక్షణ సమితి, సంయుక్త కార్యాచరణ కమిటీ సభ్యులు మంగళవారం నిరసనను కొనసాగించారు. ధర్నా చౌక్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలో టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు, ఎంఎల్‌సి అశోక్ బాబు, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. అమరావతి రైతుల నిరసనకు తమ సంఘీభావం తెలిపారు.

జెఎసి కన్వీనర్ శివారెడ్డి, గడ్డే తిరుపతి రావు, ఆర్‌వి స్వామి, కె రాజేంద్ర, గడ్డే రాజలింగం, వై రమణారావు, డాక్టర్ కార్తీక్, ఫణి కుమార్, కొమ్మూరి పట్టాభి, జిఎస్ఎస్ ప్రసాద్, ప్రొఫెసర్ శ్రీనివాస్, డాక్టర్ స్వప్న, పెద్ద సంఖ్యలో ఎపిసి సభ్యులు నిరసనలో పాల్గొన్నారు. రాజధాని నగరాన్ని మార్చాలనే ప్రతిపాదనకు నిరసనగా సిద్ధార్థ వాకర్స్ క్లబ్, అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు సిద్ధార్థ ఆడిటోరియం నుండి ర్యాలీని చేపట్టే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వారిని ఆపి ఆడిటోరియం గేట్లను మూసివేశారు. ర్యాలీ చేపట్టడానికి ప్రదర్శనకారులకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

రాజధానిని మార్చాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శనకారులు మైదానం చుట్టూ తిరిగారు. రాజధాని నగర నిర్మాణానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులకు మాత్రమే సమస్య పరిమితం కాదని వాకర్స్ క్లబ్ సభ్యులు నాగార్జున, జనార్థన్ తదితరులు తెలిపారు. ఇది రాష్ట్ర ప్రజలందరి సమస్య అని వారు అన్నారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో అమరావతిలో రాజధాని నగరానికి అనుకూలంగా ఒక ప్రకటన చేశారని, ఇప్పుడు ఆయన తన వైఖరిని మార్చుకున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశా రు. జగన్ కేబినెట్ సహచరులతో హై పవర్ కమిటీ నిండి ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి మరోసారి ఆలోచించి అమరావతిలో రాజధాని నగరాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.