ఉద్యోగుల్లో కోతలు వద్దంటూ.. మహారాష్ట్ర సీఎంను కలిసిన టెకీలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉపాధి అవకాశాలపై భారీగా పడుతోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించవద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా.. కొన్ని కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. దీంతో తమకు న్యాయం చేయాలంటూ మహారాష్ట్ర టెకీలు సీఎం ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాశారు. కోవిడ్‌-19 సంక్షోభంలో ఐటీ కంపెనీలు ఉద్యోగుల తొలగింపునకు, వేతన కోతలకు పాల్పడుతున్నాయని పేర్కొంటూ ఐటీ ఉద్యోగుల యూనియన్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాసింది. ఐటీ ఉద్యోగుల జీవనోపాధిని […]

ఉద్యోగుల్లో కోతలు వద్దంటూ.. మహారాష్ట్ర సీఎంను కలిసిన టెకీలు
Follow us

|

Updated on: May 27, 2020 | 8:10 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉపాధి అవకాశాలపై భారీగా పడుతోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించవద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా.. కొన్ని కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. దీంతో తమకు న్యాయం చేయాలంటూ మహారాష్ట్ర టెకీలు సీఎం ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాశారు. కోవిడ్‌-19 సంక్షోభంలో ఐటీ కంపెనీలు ఉద్యోగుల తొలగింపునకు, వేతన కోతలకు పాల్పడుతున్నాయని పేర్కొంటూ ఐటీ ఉద్యోగుల యూనియన్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాసింది. ఐటీ ఉద్యోగుల జీవనోపాధిని కాపాడేందుకు జోక్యం చేసుకోవాలని సీఎంను ఈ లేఖలో అభ్యర్ధించింది. మహారాష్ట్ర వ్యాప్తంగా పలు ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీలు కోవిడ్‌-19 సాకుతో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయని, వారి జీతాలను ఇవ్వకుండా, కోతలు విధిస్తూ ఇ‍బ్బందులకు గురిచేస్తున్నాయని జాతీయ ఐటీ ఉద్యోగుల సెనేట్‌ (NITES) సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు రాసిన లేఖలో పేర్కొంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని NITES ప్రధాన కార్యదర్శి హర్‌ప్రీత్‌ సలూజా అన్నారు. ఇలాంటి పరీక్షా సమయంలో ప్రభుత్వం ఉద్యోగుల హక్కులను కాపాడేలా ఆయా కంపెనీలను ఆదేశించాలని లేఖలో కోరింది.

Latest Articles
గుడ్డు.. వెరీగుడ్డు.. గాడిద గుడ్డు.. తెలంగాణలో పొలిటికల్ హీట్..
గుడ్డు.. వెరీగుడ్డు.. గాడిద గుడ్డు.. తెలంగాణలో పొలిటికల్ హీట్..
అతి తక్కువ ధరకే 1GBPS వేగంతో ఇంటర్నెట్.. బీఎస్ఎన్ఎల్ నుంచి..
అతి తక్కువ ధరకే 1GBPS వేగంతో ఇంటర్నెట్.. బీఎస్ఎన్ఎల్ నుంచి..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ థై ఫ్యాట్ తగ్గి సన్నగా కనిపిస్తారు..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ థై ఫ్యాట్ తగ్గి సన్నగా కనిపిస్తారు..
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మెల్ బాయ్స్.. ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మెల్ బాయ్స్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసిందట..! అన్నకే తప్పలేదు మనమెంత
ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసిందట..! అన్నకే తప్పలేదు మనమెంత
'కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా?'.. మాజీమంత్రి హరీష్‌ రావు
'కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా?'.. మాజీమంత్రి హరీష్‌ రావు
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
కిర్రాక్ లుక్.. క్రేజీ ఫీచర్స్.. కొత్త ఈ-బైక్ మామూలుగా లేదుగా..
కిర్రాక్ లుక్.. క్రేజీ ఫీచర్స్.. కొత్త ఈ-బైక్ మామూలుగా లేదుగా..
టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా 8 మంది ఆర్సీబీ ప్లేయర్లు.. ఫుల్ లిస్ట్
టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా 8 మంది ఆర్సీబీ ప్లేయర్లు.. ఫుల్ లిస్ట్