పాక్‌లో రోజురోజుకు పెరుగుతున్న కేసులు.. 60 వేలకు చేరువలో..

పొరుగు దేశం పాకిస్థాన్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. మొన్నటి వరకు కేసుల సంఖ్య సాధారణంగా ఉందనుకుంటే.. ఇప్పడు అరవై వేలకు చేరువలో ఉంది. తాజాగా మరో 1,446 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59,151కి చేరింది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 1,225 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. […]

  • Publish Date - 8:05 pm, Wed, 27 May 20 Edited By:
పాక్‌లో రోజురోజుకు పెరుగుతున్న కేసులు.. 60 వేలకు చేరువలో..

పొరుగు దేశం పాకిస్థాన్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. మొన్నటి వరకు కేసుల సంఖ్య సాధారణంగా ఉందనుకుంటే.. ఇప్పడు అరవై వేలకు చేరువలో ఉంది. తాజాగా మరో 1,446 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59,151కి చేరింది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 1,225 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. దేశంలో నమోదైన కేసుల్లో అత్యధికంగా సింధ్ ప్రావిన్స్‌లోనే నమోదవుతున్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 23,507కి చేరింది. ఇక పంజాబ్‌లో 21,118 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ఖైబర్ ప్రాంతంలో 8,259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక బలుచిస్తాన్‌ ప్రాంతంలో 3,536 కేసులు నమోదవ్వగా. ఇస్లామాబాద్‌లో 1,879 కేసులు, గిల్గిట్ బల్టిస్తాన్‌ ప్రాంతంలో 638 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు 19,412 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొన్నారు.