ఢిల్లీలో కాల్పులు, ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్

ఐసిస్ కి చెందిన ఓ ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిని అబూ యూసుఫ్ అనే టెర్రరిస్ట్ గా గుర్తించారు. బాంబుల తయారీలో ఉపయోగించే 15 కేజీల పేలుడు పదార్థాలను, ఓ పిస్టల్ ను ఇతడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Umakanth Rao
  • Publish Date - 11:01 am, Sat, 22 August 20
ఢిల్లీలో కాల్పులు, ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్

ఐసిస్ కి చెందిన ఓ ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిని అబూ యూసుఫ్ అనే టెర్రరిస్ట్ గా గుర్తించారు. బాంబుల తయారీలో ఉపయోగించే 15 కేజీల పేలుడు పదార్థాలను, ఓ పిస్టల్ ను ఇతడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో వీటిని నిర్వీర్యం చేశారు. యూపీలోని బలరాం పూర్ కు చెందిన అబూ యూసుఫ్..నగరంలోని కొన్ని ప్రాంతాలను టార్గెట్ గా చేసుకున్నాడని, తన సహచరుల సహకారం లేకుండానే ఒంటరిగా దాడులు చేయాలనుకున్నాడని పోలీసులు వెల్లడించారు.

ఢిల్లీలోని కరోల్ బాగ్, దౌలత్ కమాన్ మధ్య శుక్రవారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో.. ఇతనికి, స్థానిక పోలీసులకు మధ్య కొద్దిసేపు కాల్పులు జరిగాయని డీసీపీ ప్రమోద్ సింగ్ కుష్వారా తెలిపారు. సిటీలో చాలా చోట్ల ఈ ఉగ్రవాది రెక్కీ కూడా నిర్వహించాడని ఆయన చెప్పారు. ఐసిస్ తో లింక్ ఉన్న ఓ డాక్టర్ ను బెంగుళూరులో ఇటీవల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ అధికారులు అరెస్టు చేసిన విషయం గమనార్హం.