బ్రేకింగ్: ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం.. ధృవీకరించిన ట్రంప్!

వరల్డ్‌లోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన ఇస్లామిక్ లీడర్ అబూ బకర్ బాగ్దాదీ సిరియాలో జరిగిన యుఎస్ దళాల ఆపరేషన్‌లో మరణించాడని ఆదివారం ఉదయం నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనిపై కాసేపటి క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టత ఇచ్చారు. ఐసిస్ అగ్రనాయకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ మృతిని ట్రంప్ ధ్రువీకరించారు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ..  బాగ్దాదీ తనంతట తానే పేల్చుకుని చనిపోయాడని ట్రంప్ స్పష్టం చేశారు. భద్రతా దళాలు బాగ్దాదీని […]

బ్రేకింగ్: ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం.. ధృవీకరించిన ట్రంప్!

వరల్డ్‌లోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన ఇస్లామిక్ లీడర్ అబూ బకర్ బాగ్దాదీ సిరియాలో జరిగిన యుఎస్ దళాల ఆపరేషన్‌లో మరణించాడని ఆదివారం ఉదయం నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనిపై కాసేపటి క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టత ఇచ్చారు. ఐసిస్ అగ్రనాయకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ మృతిని ట్రంప్ ధ్రువీకరించారు.

దీనిపై ట్రంప్ మాట్లాడుతూ..  బాగ్దాదీ తనంతట తానే పేల్చుకుని చనిపోయాడని ట్రంప్ స్పష్టం చేశారు. భద్రతా దళాలు బాగ్దాదీని వెంబడించిన సమయంలో.. అతను తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మాహుతి చేసుకున్నట్లు చెప్పారు. వేలాదిమంది అమాయకులను తన ఉగ్రాకార్యకలాపాలతో చంపిన బాగ్దాదీ చివరి క్షణంలో ఎంతో పిరికివాడిగా.. కుక్క చావు చచ్చాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇప్పుడు ప్రపంచం అంతా సురక్షితంగా ఉంటుందని ఆయన అభివర్ణించారు.

Click on your DTH Provider to Add TV9 Telugu