AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగా, నందమూరి హీరోల ఫైట్.. సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన ‘భీష్మ’

పండగ సీజన్ వచ్చిందంటే చాలు.. మన టాలీవుడ్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంటారు. కొన్నిసార్లు ఏకంగా పెద్ద హీరోలే ఫైట్‌కి దిగుతుంటారు. జయాపజయాల గురించి పక్కన పెడితే.. ఈ మధ్యకాలంలో చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అన్నీ కూడా మొదటి వారంలో దాదాపుగా కలెక్షన్స్ రాబట్టుకోవాలని ప్లాన్స్ వేస్తుంటారు. ఇక రాబోయే క్రిస్మస్ సీజన్‌కు ముగ్గురు స్టార్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వారిలో ఒకరు సీనియర్ హీరో బాలకృష్ణ కాగా.. […]

మెగా, నందమూరి హీరోల ఫైట్.. సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన 'భీష్మ'
Ravi Kiran
|

Updated on: Oct 27, 2019 | 7:32 PM

Share

పండగ సీజన్ వచ్చిందంటే చాలు.. మన టాలీవుడ్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంటారు. కొన్నిసార్లు ఏకంగా పెద్ద హీరోలే ఫైట్‌కి దిగుతుంటారు. జయాపజయాల గురించి పక్కన పెడితే.. ఈ మధ్యకాలంలో చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అన్నీ కూడా మొదటి వారంలో దాదాపుగా కలెక్షన్స్ రాబట్టుకోవాలని ప్లాన్స్ వేస్తుంటారు. ఇక రాబోయే క్రిస్మస్ సీజన్‌కు ముగ్గురు స్టార్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వారిలో ఒకరు సీనియర్ హీరో బాలకృష్ణ కాగా.. మిగిలిన ఇద్దరూ నితిన్, సాయి ధరమ్ తేజ్‌లు. ఇప్పుడు ఒకసారి ఆ చిత్రాలను పరిశీలిస్తే..

1.రూలర్:

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తెరకెక్కిస్తున్న మాస్ మసాలా సినిమా ‘రూలర్’. హ్యాపీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో బాలయ్య రెండు షేడ్స్‌లో కనిపిస్తున్నారట. అంతేకాకుండా ఒక సిన్సియర్ పోలీస్ ఎలా గ్యాంగ్‌స్టర్‌గా మారాడన్నది చిత్ర కథాంశం అని టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్లలన్నింటిలో బాలకృష్ణ లుక్ అదుర్స్ అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక తాజాగా ఈ దీపావళీ కానుకగా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్‌ను ఖరారు చేసింది. వచ్చే నెల 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ నందమూరి ఫ్యాన్స్‌కు ఫీస్ట్ అని చెప్పాలి.

2. ప్రతి రోజూ పండగే:

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ప్రతి రోజూ పండగే’. సత్యరాజ్, నాజర్, రావు రమేష్ వంటి సీనియర్ ఆర్టిస్టులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వయసు పైబడుతున్న వారికి బెస్ట్ సెండాఫ్ ఇవ్వాలనే కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. పూర్తి వైవిధ్యభరితంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్, జిఏ2 ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా, ఈ చిత్రం కూడా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

3. భీష్మ:

నితిన్, రష్మిక మందన్నా జంటగా దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘భీష్మ’. ‘సింగిల్ ఫరెవర్’ అనే ట్యాగ్‌లైన్‌తో పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ఛలో’తో సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల ఈ ప్రాజెక్ట్‌ను కూడా అంటే ప్రస్టేజియస్‌గా రూపొందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తుండగా.. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రం క్రిస్మస్ బరిలోనే రానుందని తెలుస్తోంది. రిలీజ్ డేట్‌పై చిత్ర యూనిట్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.

Follow Us
పురావస్తు తవ్వకాల్లో 2000ఏళ్లనాటి నిధి! బూడిద కుప్పలో దాగి ఉన్న
పురావస్తు తవ్వకాల్లో 2000ఏళ్లనాటి నిధి! బూడిద కుప్పలో దాగి ఉన్న
ఏకాదశి స్పెషల్.. చిట్టి చిట్టి మురుకులు ఎలా చేయాలంటే?
ఏకాదశి స్పెషల్.. చిట్టి చిట్టి మురుకులు ఎలా చేయాలంటే?
దేవశయని ఏకాదశి.. ఈ 5 వస్తువులు దానం చేస్తే అదృష్టం, ఐశ్వర్యం..
దేవశయని ఏకాదశి.. ఈ 5 వస్తువులు దానం చేస్తే అదృష్టం, ఐశ్వర్యం..
గ్రహాల అనుకూలత.. ఆ రాశులకు విదేశీ ఉద్యోగాల ఛాన్స్!
గ్రహాల అనుకూలత.. ఆ రాశులకు విదేశీ ఉద్యోగాల ఛాన్స్!
నన్ను బిగ్‌బాస్‌లోకి తీసుకోండి.. మంచిర్యాల ఆటో డ్రైవర్ పాదయాత్ర
నన్ను బిగ్‌బాస్‌లోకి తీసుకోండి.. మంచిర్యాల ఆటో డ్రైవర్ పాదయాత్ర
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం.. ఇలా చేస్తే ఒక్క చుక్క పాలు..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం.. ఇలా చేస్తే ఒక్క చుక్క పాలు..
తొలి బంతికే వికెట్.. అరుదైన రికార్డుతో చరిత్ర సృష్టించిన మయాంక్..
తొలి బంతికే వికెట్.. అరుదైన రికార్డుతో చరిత్ర సృష్టించిన మయాంక్..
చావు దాకా వెళ్లి తిరిగొచ్చారు..! యముడు నిజంగానే లీవ్‌లో ఉన్నాడేమో
చావు దాకా వెళ్లి తిరిగొచ్చారు..! యముడు నిజంగానే లీవ్‌లో ఉన్నాడేమో
చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి
చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి
ఎడారి ఓడల కాళ్లకు బొబ్బలు! నడవలేక కుప్పకూలుతున్న ఒంటెలు
ఎడారి ఓడల కాళ్లకు బొబ్బలు! నడవలేక కుప్పకూలుతున్న ఒంటెలు