‘జబర్దస్త్’ రూల్స్ మారాయట.. టీఆర్పీల కోసమేనా.?
బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతున్న షోలు ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ అని చెప్పొచ్చు. సుమారు ఏడేళ్ల నుంచి ఈ షో ప్రేక్షకుల మన్నలు పొందుతూ నిరవధికంగా ప్రసారమవుతోంది. ఇదిలా ఉంటే కొద్దిరోజుల కిందట మెగా బ్రదర్ నాగబాబు షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో టీమ్ లీడర్లు, కంటెస్టెంట్లు మళ్ళీ పాత పద్దతిని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రెండు షోలు మొదలైనప్పుడు టీమ్ లీడర్లు ఇతరులను కించపరిచే విధంగా […]
బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతున్న షోలు ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ అని చెప్పొచ్చు. సుమారు ఏడేళ్ల నుంచి ఈ షో ప్రేక్షకుల మన్నలు పొందుతూ నిరవధికంగా ప్రసారమవుతోంది. ఇదిలా ఉంటే కొద్దిరోజుల కిందట మెగా బ్రదర్ నాగబాబు షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో టీమ్ లీడర్లు, కంటెస్టెంట్లు మళ్ళీ పాత పద్దతిని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ రెండు షోలు మొదలైనప్పుడు టీమ్ లీడర్లు ఇతరులను కించపరిచే విధంగా కాన్సెప్ట్‌లు సిద్ధం చేసుకుని.. డబుల్ మీనింగ్ డైలాగులతో కామెడీని పండించేవారు. దానితో ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ షోలపై అప్పట్లో కొన్ని విషయాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే నాగబాబు జడ్జ్ కావడంతో.. అశ్లీలతకు, డబుల్ మీనింగ్ డైలాగులకు, బూతు పురాణానికి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. దీంతో క్రమేపి ఈ షో టీఆర్పీ రేటింగ్స్‌లో పుంజుకుంటూ.. టాప్ ప్లేస్ దక్కించుకుంది.
అయితే రీసెంట్‌గా షో నుంచి నాగబాబు ఎగ్జిట్ కావడంతో.. మళ్ళీ టీమ్ లీడర్లు ఓల్డ్ స్కూల్ ఫార్ములాను ఫాలో అవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. వర్ణ వివక్ష, ఇతరులను కించపరచడం, ఓ వర్గం వారిని టార్గెట్ చేస్తుండటం వంటి అంశాలు మరీ దిగజారుడుతనానికి అద్దం పట్టేలా ఉన్నాయని కొంతమంది అంటున్నారు.
కొత్త కాన్సెప్ట్‌లు అనుకుని.. వాటి ద్వారా కామెడీని పండించడం చాలా శ్రమతో కూడిన సంగతే. మంచి కామెడీని పండిస్తే బాగానే ఉంటుంది గానీ.. ఇతరులను కించపరిచే విధంగా నవ్వును తెప్పించడం సరికాదని నెటీజన్లు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం జడ్జ్‌గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే రోజా దీనిపై కాస్త దృష్టి సారిస్తే మంచిదని అందరి అభిప్రాయం.