IPL 2025 Auction: తక్కువ ధరతో మళ్లీ చెన్నై గూటికే రచిన్ రవీంద్ర.. ధోనీ టీమ్ స్కెచ్ అద్దిరిపోయిందిగా
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా వేలం రసవత్తరంగా కొనసాగుతోంది. స్టార్ ప్లేయర్లను దక్కించుకోవడానికి ఫ్రాంఛైజీలు పోటీ పడుతున్నాయి. కొందరు డైరెక్టుగా ప్లేయర్లను కొనుగోలు చేస్తుంటే మరికొందరు మాత్రం తమదైన ప్లాన్స్ తో తమ ప్లేయర్లను తిరిగి తమ జట్టులోకి తీసుకొంటున్నారు.
ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన బిడ్ రిషబ్ పంత్ దే. అతని కోసం లక్నో సూపర్ జెయింట్ ఏకంగా రూ. 27 కోట్లకు బిడ్ వేసింది. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్‌కి 26 కోట్ల 75 లక్షలు వచ్చాయి. ఇంతలో, కొన్ని నాల్గవ సెట్లలో ఆల్ రౌండర్ కోసం వేలం పాట . చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్ తర్వాత రచిన్ రవీంద్రను విడుదల చేసింది. కాబట్టి అతడిని మళ్లీ జట్టులోకి తీసుకోవడానికి మెగా వేలం తప్ప మరో మార్గం లేదు. కాగా రూ. 1.50 కోట్ల బేస్ ప్రైస్‌తో రచిన్ రవీంద్ర వేలంలోకి ప్రవేశించాడు. పంజాబ్ కింగ్స్ అతనిని దక్కించుకునేందుకు బాగా ప్రయత్నించింది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ స్మార్ట్ బిడ్ వేసి ఈ స్టార్ ఆల్ రౌండర్ ను మళ్లీ సొంతం చేసుకుంది.. నిజానికి బేస్ ధర నుంచే చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య పోరు మొదలైంది. రచిన్ రవీంద్ర కోసం పంజాబ్ కింగ్స్ రూ 3.20 కోట్ల వరకు వెళ్లగా.. చెన్నై సూపర్ కింగ్స్ చేతులెత్తేసింది. దీంతో రచిన్ రవీంద్ర పంజాబ్ కింగ్స్ కే సొంతమవుతాడని చాలా మంది ఫిక్స్ అయ్యారు. అయితే ఇక్కడే ఆట మలుపు తిరిగింది. వేలం నిర్వాహకులు చెన్నై సూపర్ కింగ్స్‌ను RTM కార్డు గురించి అడగగా వారు వెంటనే అంగీకరించారు. దీంతో పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ గందరగోళంలో పడింది. ఇది చెన్నై తెలివైన ఎత్తుగడ .
పంజాబ్ కింగ్స్ RTM కార్డుల కోసం చాలా మందిని సంప్రదించారు. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.నిజానికి రచిన్ రవీంద్ర మంచి ఆటగాడు. న్యూజిలాండ్ జట్టు టెస్టు కోసం భారత్‌కు వచ్చింది. ఆ తర్వాత ప్రాక్టీస్ కోసం చెన్నై ఫ్రాంచైజీ అతనికి సహాయం చేసింది. ఇప్పుడు తెలివిగా వేలం వేసి అతడిని చౌకగా జట్టులోకి తీసుకోగలిగింది. ఐపీఎల్ మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. రితురాజ్ గైక్వాడ్‌సథాయ్‌కు 18 కోట్లు, రవీంద్ర జడేజాకు 18 కోట్లు, మతీషా పతిరనకు 13 కోట్లు, శివమ్ దూబేకి 12 కోట్లు, అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ధోనీకి 4 కోట్లు. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో రవిచంద్రన్ అశ్విన్ 9 కోట్ల 75 లక్షలు, డెవాన్ కాన్వే 6 కోట్ల 25 లక్షలు, రచిన్ రవీంద్ర 4 కోట్లు, రాహుల్ త్రిపాఠి 3 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసింది.
Multiverse of Ravis!
RAVIchandran Ashwin! 💥 RAVIndra Jadeja!✨ RAVIndra, Rachin! 🥳#WhistlePodu #SuperAuction pic.twitter.com/Mdd5cc8MEP
— Chennai Super Kings (@ChennaiIPL) November 24, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.