R Ashwin IPL Auction 2025: గతేడాది రూ. 5 కోట్లు.. కట్‌చేస్తే.. ఊహించని ప్రైజ్‌తో సొంతం చేసుకున్న టీమిండియా ఆల్ రౌండర్..
R Ashwin IPL 2025 Auction Price: టీమిండియా ఆల్ రౌండర్ ఆర్. అశ్విన్ కోసం రాజస్థాన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తీవ్రంగా తలపడ్డాయి. చివరకు చెన్నై టీం తగ్గేదేలే అంటూ ఊహించని ప్రైజ్‌తో సొంతం చేసుకుంది. దీంతో అశ్విన్ తన చివరి సీజన్‌ను చెన్నైతోనే ఆడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
రెండు వందలకు పైగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం అశ్విన్‌ది. పైగా ప్రపంచ క్రికెట్ లోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడు. అయితే ఈసారి మెగా వేలానికి ముందు రవిచంద్రన్ అశ్విన్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రిటైన్ చేయలేదు. అయితే మెగా వేలంలో అశ్విన్ ను జట్టులోకి తీసుకునేందుకు పలు టీమ్‌లు ఆసక్తి చూపుతున్నట్లు చాలా కాలంగా వినిపిస్తోంది. ఈ ఏడాది మెగా వేలంలో ఎంట్రీ ఇచ్చిన అశ్విన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంతం చేసుకుంది. రూ. 9.75 కోట్లకు దక్కించుకుంది.
ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. ఆమరుసటి ఏడాదే అంటే 2009లో CSK జెర్సీతో IPL అరంగేట్రం చేసాడు అశ్విన్. అప్పటి నుంచి ఐపీఎల్‌లో 212 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 180 వికెట్లు పడగొట్టాడు. అలాగే 800 పరుగులు కూడా చేశాడు. అశ్విన్ వరుసగా 8 ఏళ్ల పాటు చెన్నై జట్టులో ఆడాడు. 2010, 2011 సీజన్లలో IPL ట్రోఫీని గెల్చుకున్న చెన్నై టీమ్ లో సభ్యునిగా కూడా ఉన్నాడు. అలాగే 2011, 2014 సీఎస్కే ఛాంపియన్స్ లీగ్ టైటిల్ అందుకోవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. అయితే CSKతో అతని సంబంధం 2015లో ముగిసింది. ఆ తర్వాత 2016-17లో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్‌కు ఆడాడు. 2018-19 IPL సీజన్లలో కింగ్స్ XI పంజాబ్ కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత 2020-21 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడాడు. ఆ తర్వాత 2022 నుండి రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో ఉన్నాడు.