IPL Auction 2021: మాక్స్‌వెల్ ఆర్‌సీబీకి.. చెన్నైకి స్మిత్.? వేలంలో అమ్ముడుపోయే ప్లేయర్స్ వీరేనా.!!

IPL Auction 2021: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)- 2021 వేలంకు రంగం సిద్దమైంది. ఈ నెల 18న చెన్నై వేదికగా నిర్వహించనున్న మినీ వేలం...

IPL Auction 2021: మాక్స్‌వెల్ ఆర్‌సీబీకి.. చెన్నైకి స్మిత్.? వేలంలో అమ్ముడుపోయే ప్లేయర్స్ వీరేనా.!!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 16, 2021 | 9:51 PM

IPL Auction 2021: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)- 2021 వేలంకు రంగం సిద్దమైంది. ఈ నెల 18న చెన్నై వేదికగా నిర్వహించనున్న మినీ వేలం కోసం క్రికెటర్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 1,114 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా.. కేవలం 292 మందికి మాత్రమే అనుమతి దక్కింది. వేలంలో మొత్తం 164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు చోటు దక్కించుకున్న విషయం విదితమే.

ఈ 292 ఆటగాళ్లలో ఫ్రాంచైజీలు పలువురు అంతర్జాతీయ స్టార్స్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్లెన్‌ మాక్స్‌వెల్‌, స్టీవ్‌ స్మిత్‌, షకీబ్ అల్ హసన్, హాల్స్, లెవీస్, జాసన్ రాయ్, మాలన్, మోరిస్, జమీసన్ వంటి ప్లేయర్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని టాక్. అటు ఇప్పటికే గ్లెన్‌ మాక్స్‌వెల్‌‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేయనున్నట్లు.. స్టీవ్ స్మిత్‌ను చెన్నై సూపర్ కింగ్స్ తీసుకోనున్నట్లు ఇన్‌సైడ్ టాక్. మరి ఇందులో నిజమేదో తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.

మరిన్ని చదవండి:

‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..

ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…

భర్తతో కలిసి ఫేవరెట్ ప్లేస్‌లో కాజల్ డిన్నర్ డేట్.. అదేంటో మనం కూడా చూసేద్దాం..!