NEET 2021: నీట్‌ పరీక్షపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర విద్యాశాఖ.. ఈ సారి ప్రశ్నపత్రంలో ఆ అవకాశం..

Internal Choices In NEET 2021: కరోనా కారణంగా విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. కాలేజీలు తెరుచుకోకపోవడం, ఆన్‌లైన్‌ తరగుతుల ప్రభావంతో విద్యార్థుల చదువులపై ఈ ప్రభావం పడింది. అయితే విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు..

NEET 2021: నీట్‌ పరీక్షపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర విద్యాశాఖ.. ఈ సారి ప్రశ్నపత్రంలో ఆ అవకాశం..
Follow us

|

Updated on: Jan 20, 2021 | 9:55 AM

Internal Choices In NEET 2021: కరోనా కారణంగా విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. కాలేజీలు తెరుచుకోకపోవడం, ఆన్‌లైన్‌ తరగుతుల ప్రభావంతో విద్యార్థుల చదువులపై ఈ ప్రభావం పడింది. అయితే విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలకు తెర తీసింది. ఇప్పటికే జేఈఈ మెయిన్‌ పరీక్షలో ఛాయిస్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నీట్‌ ప్రశ్నపత్రంలోనూ ఛాయిన్‌ ఇవ్వనున్నారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్‌లో 90 ప్రశ్నల్లో 75 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలని జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) కొద్దిరోజుల క్రితం ప్రకటించింది. తాజాగా నీట్‌లోనూ ప్రశ్నల ఛాయిస్‌ ఉంటుందని కేంద్రం మంగళవారం స్పష్టంచేసింది. జేఈఈ మెయిన్‌ తరహాలోనే నీట్‌కు కూడా గత సిలబసే ఉండనుంది.

ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా నీట్‌కు దాదాపు 15 లక్షల మంది పోటీపడుతుండగా.. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.20 లక్షలమంది దరఖాస్తు చేస్తున్నారు. నీట్‌ తేదీని ప్రకటించాల్సి ఉంది. ఇక ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్‌లో చేరాలంటే ఇంటర్‌లో 75 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండేది. వచ్చే విద్యా సంవత్సరానికి (2021-22) ఆ నిబంధనను ఎత్తివేశారు. కరోనా కారణంగా 2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్‌/12వ తరగతి కనీస మార్కులతో పాసైతే చాలని, జేఈఈ మెయిన్‌/అడ్వాన్స్‌డ్‌ ర్యాంకులతో ప్రవేశాలు పొందొచ్చని కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. దాన్ని వచ్చే సంవత్సరానికి కూడా పొడిగించినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.

Also Read: కీలక నిర్ణయం తీసుకున్న ఇండియన్ రైల్వే.. ప్రయాణికుల కోసం రెడీ-టు-ఈట్-మీల్స్.. సన్నాహాలు చేస్తున్న ఐఆర్‏సీటీసీ..