AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా వెబ్ సిరీస్‌లో మార్పులు చేస్తాం, ఎవరి సెంటిమెంటునూ గాయపరచాలన్నది మా ఉద్దేశం కాదు, ‘తాండవ్’ యూనిట్

అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న  తమ 'తాండవ్' వెబ్ సిరీస్‌లో మార్పులు చేస్తామని, ఏ మతం, లేదా కులం వారిని గానీ,.

మా వెబ్ సిరీస్‌లో మార్పులు చేస్తాం, ఎవరి సెంటిమెంటునూ గాయపరచాలన్నది మా ఉద్దేశం కాదు, 'తాండవ్' యూనిట్
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 20, 2021 | 10:10 AM

Share

అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న  తమ ‘తాండవ్’ వెబ్ సిరీస్‌లో మార్పులు చేస్తామని, ఏ మతం, లేదా కులం వారిని గానీ, హిందూ దేవుళ్లను, గానీ, దేవతలను గానీ కించపరచాలన్నది తమ ఉద్దేశం కాదని ఈ సిరీస్ మేకర్స్ స్పష్టం చేశారు. ఈ సిరీస్ లో నటిస్తున్న నటీనటులు, డైరెక్టర్ తదితరులు బేషరతుగా క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే, సైఫ్ లీఖాన్, డింపుల్ కపాడియా, జేషన్ ఆయూబ్ ప్రభృతులంతా ఈ మేరకు అపాలజీ చెప్పాక కూడా దీనిపై వివాదం సద్దుమణగలేదు. యూపీ, మహారాష్ట్ర పోలీసు స్టేషన్లలో వీరిపై కేసులు అలాగే ఉన్నాయి. యూపీలో ఓ పోలీసు తాను  17 నిముషాల మొదటి ఎపిసోడ్ చూశానని, ఇందులో హిందూ దేవతలను, దేవుళ్లను కించపరిచే పలు సన్నివేశాలు ఉన్నాయని తెలిపాడు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సలహాదారు శలభ్ మణి త్రిపాఠీ ఈ సిరీస్ యూనిట్ ని తీవ్రంగా హెచ్ఛరించారు. తాము ముంబైకి వచ్చి.. ఎలా ప్రతీకారం తీర్చుకుంటామో చూడాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా  లోగడ జరిగిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్ గురించి ఆయన ప్రస్తావించారు.  తాండవ్ సిరీస్ లో ప్రధాని క్యారక్టర్ ని కూడా దిగజారుడుగా చూపారన్న ఆరోపణలున్నాయి.

తాజాగా నిన్న మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో కూడా  ఈ సిరీస్ పై కేసు నమోదయింది. దీని యూనిట్ సభ్యులపైనా, నటీనటులపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరారు.

Also Read:

NEET 2021: నీట్‌ పరీక్షపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర విద్యాశాఖ.. ఈ సారి ప్రశ్నపత్రంలో ఆ అవకాశం..

‘రైతు చట్టాల కమిటీ’ పై తొలిసారి స్పందించిన సుప్రీంకోర్టు సీజేఐ ఎస్ఏ. బాబ్డే , అపోహలు తగవు, పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్య

Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సీఐడీ అధికారులు.. పలు ఆధారాల సేకరణ..

Follow Us
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్
NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్
ఈ కేంద్ర ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే క్షణాల్లోనే అన్నీ..
ఈ కేంద్ర ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే క్షణాల్లోనే అన్నీ..
నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యం ఇదే.. ఏది వద్దు ఇది తాగండి చాలు..
నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యం ఇదే.. ఏది వద్దు ఇది తాగండి చాలు..