‘రైతు చట్టాల కమిటీ’ పై తొలిసారి స్పందించిన సుప్రీంకోర్టు సీజేఐ ఎస్ఏ. బాబ్డే , అపోహలు తగవు, పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్య

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న రైతుల సమస్యపై తలెత్తిన సంక్షోభ పరిష్కారానికి తాము నియమించిన నలుగురు సభ్యుల కమిటీపై..

'రైతు చట్టాల కమిటీ' పై తొలిసారి స్పందించిన సుప్రీంకోర్టు సీజేఐ ఎస్ఏ. బాబ్డే  , అపోహలు తగవు, పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్య
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 20, 2021 | 9:43 AM

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న రైతుల సమస్యపై తలెత్తిన సంక్షోభ పరిష్కారానికి తాము నియమించిన నలుగురు సభ్యుల కమిటీపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే తొలిసారి స్పందించారు.  ఈ కమిటీ ఏర్పాటుపై కొన్ని అపోహలు ఏర్పడ్డాయని, అయితే వాటిపై చర్చ అనవసరమని అన్నారు. ఈ పానెల్ నుంచి ఒక సభ్యుడు వైదొలిగారని, అది ఆయన సొంత నిర్ణయమని అన్నారు. అంతమాత్రాన అది ఆయన అనర్హుడన్న అభిప్రాయం సరికాదన్నారు. ఒక సమస్య పరిష్కారానికి దోహదపడే సభ్యులనే పానెల్ లో నియమిస్తామన్నారు. ఎవరికైనా సొంత అభిప్రాయాలు ఉంటాయన్నారు. కాగా ఈ కమిటీ నుంచి భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ భూపేందర్ సింగ్ మాన్ తప్పుకున్న విషయం గమనార్హం. తాను కూడా రైతునేనని, అన్నదాతల ప్రయోజనాలకు నేను కూడా నా వంతు సాయపడతానంటూ ఆయన కమిటీ నుంచి వైదొలిగారు. అయితే ఏ కమిటీ ముందు కూడా తాము హాజరు కాబోమని, అసలు కోర్టు నియమించిన కమిటీలోని సభ్యులంతా వివాదాస్పద చట్టాలకు అనుకూలురేనని అన్నదాతలు అంటున్నారు. కమిటీలోని ఇతర ముగ్గురు సభ్యులు కూడా వ్యవసాయ వేత్తలే అయినప్పటికీ వారు కేంద్ర చట్టాలను సమర్థిస్తున్నారు.

ఇక బుధవారం రైతులు తమ తాజా కార్యాచరణను నిర్దేశించుకోనున్నారు. ఈ నెల 26 న ట్రాక్టర్ ర్యాలీ వీరి చర్చల్లో ప్రధాన అజెండాగా ఉండనుంది.

ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే
549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?..
చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?..
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్