Social Media Guidelines India: సోషల్ మీడియాకు భారీ షాక్ ఇచ్చిన కేంద్రం.. కొత్తగా విడుదల చేసిన నిబంధనలివే..!
గత కొంతకాలంగా సోషల్ మీడియాతో పాటు, ఓటీటీ ప్లాట్‌ఫాంలపై గుర్రుగా కేంద్ర ప్రభుత్వం.. తాజాగా కీలక ప్రకటన చేసింది. సోషల్ మీడియా..
Social Media Guidelines India: గత కొంతకాలంగా సోషల్ మీడియాతో పాటు, ఓటీటీ ప్లాట్‌ఫాంలపై గుర్రుగా కేంద్ర ప్రభుత్వం.. తాజాగా కీలక ప్రకటన చేసింది. సోషల్ మీడియా సహా ఓటీటీ ప్లాట్‌ఫాంలకు భారీ షాక్ ఇస్తూ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఈ నిబంధనలను గురువారం నాడు కేంద్రం సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. ఈ నిబంధనలతో ఓటిటి, సోషల్ మీడియాకు కళ్లెం వేసింది కేంద్రం. కాగా, వీటిని పక్కాగా అమలు చేసేందుకు మూడు అంచెల నియంత్రణ విధానాన్ని అమలు చేయనున్నామని కేంద్ర మంత్రిప్రకాష్ జవదేకర్ ప్రకటించారు.
ట్విట్టర్, వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో ఫేక్ ప్రచారం ఎక్కువైపోయింది. అలాగే ఓటీటీ ఫ్లాట్‌ఫాంలలో హద్దుల మీరిన శృంగారాన్ని చూపిస్తూ వెబ్ సిరీస్‌లు, సినిమాలు విడుదల అవుతున్నాయి. వీటిపై కేంద్రానికి పెద్ద ఎత్తున ఫిర్యాదు అందాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్- 2021 పేరుతో నిబంధనలు విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం.. ఏదైనా పోస్టును తొలగించాలని ప్రభుత్వం ఆదేశిస్తే.. తక్షణమే ఆ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే.. సదరు సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. చట్టపరమైన ఉత్తర్వులు జారీ అయిన తర్వాత, వీలైనంత త్వరగా కంటెంట్‌ను తొలగించాల్సి ఉంటుంది. దాదాపు 36 గంటల్లోపే ఆ కంటెంట్‌ను తొలగించాలి. ఇక అధికారులు ఏదైనా దర్యాప్తునకు సంబంధించిన సమాచారం అడిగితే 72 గంట్లోగా సమస్త సమాచారంతో పాటు, సహాయం అందించాల్సి ఉంటుంది. ఇక ఓటీటీ ఫ్లాట్‌ఫాంలపైనా కీలక షరతు విధించారు. సదరు సంస్థలు భారత్‌లో ఆయా కార్యాలయాలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తుల మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్- 2021 నిబంధనల్లోని ముఖ్యాంశాలు..
ఓటీటీ ఫ్లాట్‌ఫాంలకు సంబంధించి.. 1. ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ఇష్టానుసార వీడియోలు పోస్ట్ చేయరాదు. 2. అసభ్య, అశ్లీల, హింసాత్మక కంటెంట్ పై నిషేధం 3.వయస్సు ఆధారంగా 5 విభాగాలుగా ఓటీటీ విభజన 4. సామాజిక ఉద్రిక్తతలు పెంచే కంటెంట్ పై నిషేధం 5. మహిళలు, చిన్నారులు, దళితులను అవమానించే కంటెంట్‌పై నిషేధాజ్ఞలు 6. జాతీయ సమగ్రత, సమైక్యతను దెబ్బతీసే కంటెంట్ పై నిషేధం 7. అసత్య ప్రచారం ప్రారంభం చేసే తొలి వ్యక్తి వివరాలు ఖచ్చితంగా వెల్లడించాలి 8. ముఖ్యంగా ఓటీటీ ఫ్లాట్‌ఫాం సంస్థలు దేశంలోనే కార్యాలయాలు ఏర్పాటు చేయాలి.
సోషల్ మీడియాకు సంబంధించి కీలక నిబంధనలు.. 1. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం డేటా, కంటెంట్‌పై వినియోగదారుల ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించాలి. 2. అభ్యంతరకరమైన గుర్తించిన తరువాత పోస్టును 24 గంటల్లో తొలగించాలి. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. 3. నోడల్ ఏజెన్సీ ద్వారా 24 గంటలు పనిచేస్తూ పర్యవేక్షిస్తుంది. 4. ఫిర్యాదులను అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది. 5. ఈ నిబంధనలను ప్రచురించిన తేదీ నుండి 3 నెలల్లోపు చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్ (సీసీఓ) ను నియమించాలి. 6. చట్టానికి, నిబంధనలకు సీసీఓ బాధ్యత వహించాలి.
ఇదిలాఉంటే.. దేశ వ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగదారులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
1. వాట్సప్ వినియోగదారులు – 53 కోట్ల మంది. 2. ఫేస్‌బుక్ వినియోగదారులు – 41 కోట్ల మంది. 3. ఇన్‌స్టాగ్రమ్ వినియోగదారులు – 21 కోట్ల మంది. 4. ట్విట్టర్ వినియోగదారులు – 1.75 కోట్ల మంది. 5. యూట్యూబ్ వినియోగదారులు – 44.8 కోట్ల మంది.
Also read:
‘మత్స్య మంత్రిత్వ శాఖ” కామెంట్.. రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ.!
పీఎం-కిసాన్ పథకంలో రైతుల ఖాతాల్లోకి రూ.1.15 లక్షల కోట్లు బదిలీ: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
పుట్టగొడుగుల గురించి మీకు ఎంతవరకు తెలుసు.. కూర వండుకోవడానికి మాత్రమే కాదు.. అంతకు మించి..