పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని చాకచక్యంతో పడగొట్టిన బీజేపీ, ప్రత్యర్థి ప్రభుత్వాలను కూల్చడం బీజేపీకి కొత్తేమీ కాదు!

కూల్చడమంటే భారతీయ జనతాపార్టీకి మహదానందం.. అది కట్టడమైనా, ప్రభుత్వమైనా! తమకు నచ్చని ప్రభుత్వాలను పడగొట్టి ముచ్చట తీర్చుకుంటోంది అధికార బీజేపీ!..

పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని చాకచక్యంతో పడగొట్టిన బీజేపీ, ప్రత్యర్థి ప్రభుత్వాలను కూల్చడం బీజేపీకి కొత్తేమీ కాదు!
West Bengal Election 2021
Follow us

|

Updated on: Feb 25, 2021 | 3:37 PM

కూల్చడమంటే భారతీయ జనతాపార్టీకి మహదానందం.. అది కట్టడమైనా, ప్రభుత్వమైనా! తమకు నచ్చని ప్రభుత్వాలను పడగొట్టి ముచ్చట తీర్చుకుంటోంది అధికార బీజేపీ! ఇందుకోసం సామదానభేద దండోపాయాలన్నింటినీ ఉపయోగిస్తోంది.. ఈ మాట అంటున్నది బీజేపీ వ్యతిరేక పార్టీలు! విపక్షాలు అంటున్నాయని కాదు కానీ నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇదే జరుగుతోంది.. పక్కా వ్యూహంతో రాజకీయ చతురతతో తమను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వాలను కూల్చేసి అధికార పగ్గాలను చేపడుతూ వస్తున్నది. ఆరుణాచల్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో ఎలాంటి మార్గాన్ని అనుసరించిందో మనం చూశాం! తాజాగా పుదుచ్చేరిలో ప్రభుత్వాన్ని పడగొట్టి అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది.. ఇంతాచేస్తే మరో రెండు నెలల్లో అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఈ మాత్రం దానికి ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎందుకనే అనుమానం రావచ్చు.. ఎన్నికలు జరుగుతున్న సమయంలో నారాయణస్వామి ప్రభుత్వం ఉండకూడదన్నదే బీజేపీ అభిలాష.. ఆ కోరికను చాకచక్యంగా, చేతికి మట్టి అంటుకోకుండా నెరవేర్చుకుంది. రాజస్థాన్‌లోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేయాలనుకుంది కానీ అక్కడ ఫలించలేదు.. గోవా, మణిపూర్‌లలో అసెంబ్లీ ఫలితాలు ఎలా వచ్చాయో.. మూడు రోజులు తర్వాత ఏం జరిగిందో జనాలకు ఇంకా గుర్తుండే ఉంటుంది. ఆ రెండు రాష్ట్రాలలో బీజేపీ కంటే కాంగ్రెస్‌ పార్టీ ఎక్కువ సీట్లు గెల్చుకున్నా అధికారం మాత్రం బీజేపీ చేజిక్కించుకుంది.. ప్రజాస్వామ్యానికి సరికొత్త నిర్వచనం చెప్పింది.. పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎన్నో ప్రణాళికలు వేసింది. ఎన్నో పన్నాగాలు పన్నింది. అక్కడా బీజేపీ పప్పులుడకలేదు.. అరుణాచల్‌ప్రదేశ్‌నే తీసుకుందాం! ఎన్నో నాటకీయ పరిణామాల తర్వాత ఇప్పుడక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.. 2014లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.. మొత్తం 60 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 42 ఉండేది.. భారతీయ జనతాపార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి.. నబం తుకీ సారథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొన్నాళ్లకే మాజీ ముఖ్యమంత్రి డోర్జీ ఖండు కుమారుడు పెమా ఖండూ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడి వరకు బాగానే ఉంది.. 2016లో సీనంతా మారింది.. పెమా ఖండూతో పాటు మరో 41 కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా పీపుల్స్‌ పార్టీలో చేరారు. అదే ఏడాది అందరూ గంపగుత్తగా బీజేపీ గూటిలోకి చేరిపోయారు. ఆ తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోలిగింది.. కాంగ్రెస్‌ వారంతా నేరుగా తమ పార్టీలో చేరితే బాగోదనుకున్నదో ఏమో కానీ బీజేపీ వారందరినీ ముందు పీపుల్స్‌ పార్టీలో చేర్పించింది.. ఆనక తను అక్కున చేర్చుకుంది.. అక్కడితో ఆగిందా.. తమ సన్నిహితుడు, తమ మద్దతుతో సీఎం అయ్యారన్న అభిమానం కూడా లేకుండా బీహార్‌లో నితీశ్‌కుమార్‌కే సెగపెట్టింది బీజేపీ.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది.. ఈ పరిణామంతో జేడీయూ బలం కాస్త ఒకటికి పడిపోయింది.. మరోవైపు, పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ సభ్యుడితో కలిసి బీజేపీ బలం అసెంబ్లీలో 48కి పెరిగింది. గమ్మత్తేమిటంటే అరుణాచల్‌లో ప్రతిపక్షంగా ఉంటూనే బీజేపీ ప్రభుత్వానికి జేడీయూ మద్దతు ఇస్తోంది. ఇంత జరిగినా బీజేపీని పల్లెత్తు మాటకూడా అనలేని నిస్సహాయస్థితిలో పడ్డారు నితీశ్‌కుమార్‌. ఏమైనా అంటే తన సీఎం పదవికి ఎసరు వస్తుందన్న భయం కాబోలు. పైగా అరుణాచల్‌లో మేం బీజేపీకి మద్దతు కొనసాగిస్తాం. స్నేహపూర్వగ ప్రతిపక్షంగానే వ్యవహరిస్తామని చెప్పుకురావడం జేడీయూ ఆత్మవంచనే అనుకోవాలి.

గత ఏడాది మధ్యప్రదేశ్‌లో మహాత్తర నాటకం నడిచింది. కరోనా విస్తరిస్తున్న కాలంలోనే మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలింది.. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థానాలను గెల్చుకుంది. కమల్‌నాథ్‌కు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి 121 మంది ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. చేతికొచ్చిన ప్రభుత్వం చేజారిపోయిందేనన్న కసి కావచ్చు రెండేళ్లకే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేసింది బీజేపీ. ఇందుకోసం జ్యోతిరాదిత్య సింధియాను పావుగా వాడుకుంది.. 26 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించింది.. దాంతో కమల్‌నాథ్‌ గద్దె దిగాల్సి వచ్చింది.. బీజేపీకి చెందిన శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ మరోసారి సీఎం అయ్యారు. తిరుగుబాటు చేసిన 26 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో ఇందులో 19 మంది మాత్రమే విజయం సాధించినప్పటికీ బీజేపీ ప్రభుత్వానికి ఢోకా లేకుండా పోయింది.. మణిపూర్‌లోనూ అంతే.. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 28 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెసు ముఖ్యమంత్రిగా మూడు దఫాలుగా వున్న ఇబోబి సింగ్‌ నాలుగోసారి కూడా గెలిచాడు. అతనితో బాటు ఉపముఖ్యమంత్రి కూడా. మరోవైపు బీజేపీకి 21 స్థానాలు వచ్చాయి.. కాంగ్రెస్‌ పార్టీనే అధికారం చేపడుతుందనుకున్నారంతా! కానీ ఆశ్చర్యంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గవర్నర్‌ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని బీజేపీకి ఆహ్వానం పలకడం వింతలో వింత! ఇదే సమయంలో కాంగ్రెస్‌కు చెందిన తొమ్మది మంది ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించారు. దాంతో బీజేపీ మెజారిటీ సాధించింది.. అలా మణిపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే టైమ్‌లో గోవాకు కూడా ఎన్నికలు జరిగాయి.. అక్కడా అదే జరిగింది. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ 17 స్థానాలు గెల్చుకుంది. బీజేపీకి 13 సీట్లే వచ్చాయి.. అయినప్పటికీ బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వివిధ పార్టీలకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఆ విధంగా బీజేపీ గద్దెనెక్కింది. రెండేళ్ల కిందట అంటే 2019 జులైలో 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఓ బృందంగా ఏర్పడి బీజేపీలో చేరారు. దాంతో ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ బలం కాస్తా అయిదుకు పడిపోయింది. బీజేపీ బలం కాస్తా 27కు పెరిగింది. 2018లో జరిగిన కర్నాకట అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. 104 స్థానాలతో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ పార్టీకి 80 స్థానాలు, జనతాదళ్‌ సెక్యులర్‌ (జేడీఎస్‌)కు 37 సీట్లు వచ్చాయి. గవర్నర్‌ బీజేపీకి చెందిన యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పాటయ్యింది కానీ అది మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. విశ్వాస పరీక్షలో నెగ్గలేకపోయారు. ఆ కారణంగా యడ్యూరప్ప ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత జేడీఎస్‌కు కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వడంతో జేడీఎస్‌కు చెందిన కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఇది జరిగిన తర్వాత బీజేపీ మిన్నకుండిపోలేదు.. పకడ్బందీ వ్యూహరచన చేసింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు వల విసిరింది. అలాగే జేడీఎస్‌ ఎమ్మెల్యేలకూ తాయిలం చూపించింది. ఫలితంగా యడ్యూరప్ప మళ్లీ ముఖ్యమంత్రి కాగలిగారు. మహారాష్ట్రలో అయితే మహా నాటకమే సాగింది. జనరంజకమైన ఆ నాటకంలో బీజేపీనే ప్రధాన పాత్రధారి. అధికారం చేపట్టడం కోసం ఎన్నో పన్నాగాలు చేసింది.. కానీ ఏ ప్రయత్నమూ ఫలించలేదు. పైగా విమర్శల పాలయ్యింది.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలు గెల్చుకుంది. అప్పటి వరకు మిత్రపక్షంగా ఉన్న శివసేనకు 56 స్థానాలు వచ్చాయి. అయితే ముఖ్యమంత్రి స్థానం తమకే దక్కాలని శివసేన పట్టుపట్డింది. లేనిపోని పితలాటకం ఎందుకన్న ఉద్దేశంతో బీజేపీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాలేదు. దాంతో రాష్ట్రపతి పాలన అనివార్యమయ్యింది.. ఈ మధ్యలోనే బీజేపీ ఓ నాటకానికి తెర తీసింది. ఎన్‌సీపీకి చెందిన అజిత్ పవార్‌ను లాగేందుకు ప్రయత్నించింది.. అజిత్‌ పవార్‌ కూడా బీజేపీకి స్నేహహస్తం అందించారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ కేబినెట్‌లో అజిత్‌ పవార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఇక్కడే మళ్లీ ఓ ట్వీస్ట్‌ ఏర్పడింది. శరద్‌పవార్‌ సూచనల మేరకు అజిత్‌ పవార్‌ బీజేపీ వైపుకు వెళ్లారో లేక తనకు తానుగానే నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ అజిత్ పవార్‌ వెంటనే తన మనసు మార్చుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహిస్తే అందులో దేవేంద్ర ఫడ్నవీస్‌ ఓడిపోయారు. ఆ తర్వాత శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటయ్యాయి.. ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న ఉధవ్‌ థాక్రే కోరిక తీరింది. బీజేపీని అధికారంలోకి రానివ్వకూడదన్న ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ల పంతమూ నెగ్గింది.. ఉత్తరాఖండ్‌లోనూ వేలు పెట్టి చేతులు కాల్చుకుంది బీజేపీ. గతంలో అక్కడ హరీశ్‌ రావత్‌ సారథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండింది. 2016 మార్చిలో తొమ్మిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకుంది బీజేపీ. హరీశ్‌ రావత్‌ ప్రభుత్వం కూలిపోయింది. కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. అయితే సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో హరీశ్‌ రావత్‌ మళ్లీ సీఎం అయ్యారు. కాకపోతే 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయింది. బీజేపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. జమ్ముకశ్మీర్‌లో పీపుల్స్‌ డెమెక్రటిక్‌ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీతో ముందు చేతులు కలిపిన బీజేపీ ఆ తర్వాత చేయిచ్చింది.. 2018 జూన్‌లో మెహబూబా ప్రభుత్వం కూలింది. కారణం బీజేపీ తన మద్దతు ఉపసంహరించుకోవమే! రాష్ట్రంలో పరిస్థితులను అదుపులో పెట్టడంలో ముఫ్తీ సర్కారు విఫలం చెందిందన్నది బీజేపీ ఆరోపణ. సరే.. దీని తర్వాత ఆ రాష్ట్రంలో గవర్నర్‌ పాలన రావడం, ఆటు పిమ్మట జమ్ముకశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను తొలగించడం, జమ్ము కశ్మీర్‌ నుంచి లడఖ్‌ను వేరు చేయడం మనకు తెలిసిన విషయాలే! బీహార్‌లోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేసింది బీజేపీ. రాష్ట్రీయ జనతాదళ్‌, కాంగ్రెస్‌ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్‌కుమార్‌ 2017లో కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో చేతులు కలిపారు.. ఇప్పుడు తాజాగా పుదుచ్చేరి. అక్కడ వి.నారాయణస్వామి ప్రభుత్వాన్ని పకడ్బందీ వ్యూహంతో బీజేపీ పడగొట్టింది. కాంగ్రెస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, డీఎంకేకు చెందిన ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో నారాయణస్వామి ప్రభుత్వం పడిపోయింది. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇది.. కాంగ్రెస్‌ రహిత దేశంగా చేయాలనుకుంటున్న బీజేపీ అందుకే నారాయణస్వామి ప్రభుత్వాన్ని కూల్చేసిందేమో! మరో రెండు నెలలలో ఎన్నికలు జరగబోతున్న పుదుచ్చేరిలో ఏ ప్రయోజనాన్ని ఆశించి బీజేపీ ఈ ఆలోచన చేసిందో అర్థం కావడం లేదు.. మొత్తంగా ఎనిమిది రాష్ట్రాలలో ఓ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రత్యర్థి ప్రభుత్వాలను పడగొట్టడమో లేక ప్రభుత్వంలోకి రాకుండా చేయడమో చేసింది భారతీయ జనతా పార్టీ. ఇక్కడితో ఆగుతుందా? సమీప భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నం చేస్తుందా? ఈ ప్రశ్నలకు కాలం సమాధానం చెబుతుంది.

మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా