అమెరికా అల్లర్లలో భారత జాతీయ పతాకమా ? ఎవరు పట్టుకున్నారు ? అక్కడెందుకుంది ? వరుణ్ గాంధీ ఆగ్రహం

అమెరికాలో ట్రంప్ మద్దతుదారుల ఆందోళన  సందర్భంగా ఎవరో నిరసనకారుడు భారత జాతీయ పతాకాన్ని పట్టుకున్న ఓ వీడియో హల్చల్ చేస్తోంది..

  • Umakanth Rao
  • Publish Date - 3:18 pm, Thu, 7 January 21
అమెరికా అల్లర్లలో భారత జాతీయ పతాకమా ? ఎవరు  పట్టుకున్నారు ? అక్కడెందుకుంది ? వరుణ్ గాంధీ ఆగ్రహం

Indian Flag: అమెరికాలో ట్రంప్ మద్దతుదారుల ఆందోళన  సందర్భంగా ఎవరో నిరసనకారుడు భారత జాతీయ పతాకాన్ని పట్టుకున్న ఓ వీడియో హల్చల్ చేస్తోంది. దీన్ని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ పోస్ట్ చేస్తూ…. ఈ మన మువ్వన్నెల పతాకం క్యాపిటల్ బిల్డింగ్ బయట ప్రొటెస్ట్ చేస్తున్నవారిదగ్గర ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఈ విధమైన ఆందోళనలో మనం పాల్గొంటామా అన్నారు. అసలిది అమెరికా 200 ఏళ్ళ చరిత్రలో ఆ దేశ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి తప్ప మరేమీ కాదని ఆయన అన్నారు.  ట్రంప్ మద్దతుదారుల చేతుల్లో ఆ దేశ జాతీయ పతాకాలు, ట్రంప్ చిత్రంతో కూడిన బ్యానర్లు, పోస్టర్లు ఉన్నాయి.  అయితే ఇన్ని వేలమందిలో మన ఇండియన్ ఫ్లాగ్ కనబడడం ఆశ్చర్యమే కాక..ఆందోళన కూడా కలిగిస్తోంది. ఆ వ్యక్తి ఎవరు.? ఈ పతాకాన్ని తెలియకుండా పట్టుకున్నాడా, లేక కావాలని తెలిసే పట్టుకున్నాడా అన్నది అర్థం కావడంలేదు.

 

Also Read :

Chandrababu Cabinet: కొందరు దూరం..మరికొందరు కేసుల్లో.. ఇంకొందరు మిస్సింగ్! చంద్రబాబు కేబినెట్ సహచరులకేమైంది?

రైతుల ఆందోళన కరోనా వైరస్ వ్యాప్తికి దారి తీయవచ్చు, సుప్రీంకోర్టు ఆందోళన, మర్కజ్ కేసు ప్రస్తావన

నేను గే ను కాను, ట్రాన్స్ జెండర్ గా మారిన బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్, ఎందుకంటే ? ఇది నా అభిమతం