అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం.. శ్వేతసౌధం నూతన పాలకవర్గంలో మాలా అడిగా‌కి ఛాన్స్.. పాలసీ డైరెక్టర్‌గా బాధ్యతలు

భారత సంతతికి చెందిన మరో మహిళ శ్వేతసౌధం నూతన పాలకవర్గంలో చేరనున్నారు.. ఇప్పటికే భారత ఎన్ఆర్ఐ కమలా హారిష్ అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపడుతుండగా, తాజాగా మరో మహిళనుకు యూఎస్ ఉన్నత స్థానం దక్కబోతోంది.

అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం.. శ్వేతసౌధం నూతన పాలకవర్గంలో  మాలా అడిగా‌కి ఛాన్స్..  పాలసీ డైరెక్టర్‌గా బాధ్యతలు
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 21, 2020 | 7:59 PM

భారత సంతతికి చెందిన మరో మహిళ శ్వేతసౌధం నూతన పాలకవర్గంలో చేరనున్నారు.. ఇప్పటికే భారత ఎన్ఆర్ఐ కమలా హారిష్ అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపడుతుండగా, తాజాగా మరో మహిళనుకు యూఎస్ ఉన్నత స్థానం దక్కబోతోంది. అమెరికాలో మరో ఇండియన్-అమెరికన్‌కు కీలక పదవి చేపట్టబోతున్నారు. కాబోయే అగ్రరాజ్య ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన మాలా అడిగా‌ను జో బైడెన్ శుక్రవారం నియమించారు. కాగా.. ఈమె గతంలో కాబోయే ప్రథమ మహిళ జిల్ బైడెన్ వద్ద సీనియర్ సలహాదారుగా పని చేశారు. అంతేకాకుండా బైడెన్-కమలా హారిస్ క్యాంపెయిన్‌లో సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా విధులు నిర్వర్తించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వంలో కూడా మాలా అడిగా.. కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు. ఒబామా అధికారంలోకి వచ్చిన తర్వాత అసోసియేట్‌ అటార్నీ జనరల్‌ కౌన్సిల్‌లో సభ్యురాలిగా చేరారు. ఆమె సమర్థతను గుర్తించిన జో బైడెన్ మరో అవకాశాన్ని కల్పించారు.

ఇలినాయిస్ రాష్ట్రానికి చెందిన మాలా అడిగా.. మిన్నెసోటా స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో లా స్కూల్‌లో కూడా ఆమె విద్యను అభ్యసం పూర్తి చేశారు. అనంతరం న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఇదే క్రమంలో 2008లో ఒబామా క్యాంపెయిన్‌లో చేరి కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే జో బైడెన్ కేబినెట్‌లో ముగ్గురు భారతీయులకు చోటు ఖరారైన విషయం తెలిసిందే. కాగా.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ జనవరి 20న బాధ్యతలు స్వీకరించనున్నారు.