ఇండియన్ ఎయిర్ లైన్స్ తొలి మహిళా సీఈవోగా హర్‌ప్రీత్ సింగ్

భారత విమానయాన సంస్థలో తొలి మహిళా సీఈవోగా హర్‌ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. ఎయిర్‌ ఇండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ అలయన్స్ ఎయి‌ర్‌కు సీఈవోగా ఆమెను నియమించింది కేంద్ర ప్రభుత్వం.

ఇండియన్ ఎయిర్ లైన్స్  తొలి మహిళా సీఈవోగా హర్‌ప్రీత్ సింగ్
Follow us

|

Updated on: Oct 31, 2020 | 3:04 PM

భారత విమానయాన సంస్థలో తొలి మహిళా సీఈవోగా హర్‌ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. ఎయిర్‌ ఇండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ అలయన్స్ ఎయి‌ర్‌కు సీఈవోగా ఆమెను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఏఐ సీఎండీ రాజీవ్‌ బన్సాల్‌ ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాల వరకు అలయన్స్‌ ఎయిర్‌ సీఈవోగా హర్‌ప్రీత్‌ వ్యవహరిస్తారని అందులో పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఆమె ఐఏ విమాన భద్రత విభాగానికి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు . ఆమె స్థానాన్ని కెప్టెన్ నివేదా భాసిన్ భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 1988లో ఎయిర్‌ ఇండియా తొలి మహిళా పైలట్‌గా హర్‌ప్రీత్‌ సింగ్‌ ఎంపికయ్యారు. అనంతరం అనారోగ్య కారణాల వల్ల పైల‌ట్‌గా రాణించలేకపోయినా విమాన భద్రత విభాగం విధుల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. భారత మహిళా పైలట్‌ సంఘానికి అధిపతిగాను హర్‌ప్రీత్ సింగ్ కొససాగుతున్నారు.