AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 ఓవర్లకు జింబాబ్వే విలవిల.. 4 వికెట్లతో షాకిచ్చిన వైష్ణవి శర్మ..!

India Women vs Zimbabwe Women, 3rd ODI: భారత్ మహిళల జట్టు, జింబాబ్వే మహిళల జట్టు మధ్య జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. ముఖ్యంగా యువ బౌలర్ వైష్ణవి శర్మ అద్భుత బౌలింగ్‌తో జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీసింది. 30 ఓవర్లు పూర్తయ్యేసరికి జింబాబ్వే 105 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది.

30  ఓవర్లకు జింబాబ్వే విలవిల.. 4 వికెట్లతో షాకిచ్చిన వైష్ణవి శర్మ..!
Vaishnavi Sharma Four Wickets
Venkata Chari
|

Updated on: Oct 28, 2026 | 4:05 PM

Share

India Women vs Zimbabwe Women, 3rd ODI: జింబాబ్వే మహిళల జట్టు భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో తడబడుతోంది. టాస్ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేకు భారత బౌలర్లు ఆరంభం నుంచే వరుస షాకులు ఇచ్చారు. 30 ఓవర్లు ముగిసే సమయానికి జింబాబ్వే 105 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. భారత్ తరపున యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ (Vaishnavi Sharma) అద్భుత ప్రదర్శన చేసింది. 8 ఓవర్లు వేసిన ఆమె కేవలం 29 పరుగులు ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టింది. ఆమె బౌలింగ్‌లో ఒక మెయిడిన్ ఓవర్ కూడా ఉంది. 3.63 ఎకానమీతో జింబాబ్వే బ్యాటర్లను కట్టడి చేసింది.

జింబాబ్వే బ్యాటర్లలో మోడెస్టర్ ముపాచిక్వా (Modester Mupachikwa) 48 బంతుల్లో 37 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు ఉన్నాయి. కెప్టెన్ జోసెఫిన్ న్కోమో (Josephine Nkomo) 57 బంతుల్లో 31 పరుగులతో పోరాడుతోంది. చిడెజా ధురురు 20 పరుగులు చేసింది.

మరోవైపు భారత బౌలింగ్‌లో క్రాంతి గౌడ్ (Kranti Goud) 4.2 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకుంది. సయాలి సత్ఘరే (Sayali Satghare) 4 ఓవర్లలో 9 పరుగులు ఇచ్చి ఒక వికెట్ సాధించింది.

భారత్ తరఫున దీప్తి శర్మ (Deepti Sharma), షఫాలీ వర్మ (Shafali Verma) కూడా బంతితో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా వైష్ణవి శర్మ స్పెల్ కారణంగా జింబాబ్వే భారీ స్కోరు సాధించే అవకాశాలు తగ్గిపోయాయి.

30 ఓవర్లకు జింబాబ్వే 105/6తో ఉండటంతో భారత్ మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం సాధించే దిశగా సాగుతోంది. వైష్ణవి శర్మ మరోసారి వికెట్లు తీస్తే జింబాబ్వేను తక్కువ స్కోరుకే పరిమితం చేసే అవకాశం ఉంది.

Follow Us
నాన్న మాటే స్ఫూర్తి.. UPSC టాపర్‌ నరేంద్ర పడాల్‌ సక్సెస్ జర్నీ
నాన్న మాటే స్ఫూర్తి.. UPSC టాపర్‌ నరేంద్ర పడాల్‌ సక్సెస్ జర్నీ
30 ఓవర్లకు జింబాబ్వే విలవిల.. 4 వికెట్లతో షాకిచ్చిన వైష్ణవి శర్మ
30 ఓవర్లకు జింబాబ్వే విలవిల.. 4 వికెట్లతో షాకిచ్చిన వైష్ణవి శర్మ
ఏపీలో MPTC, ZPTC ఎన్నికల తేదీలు మార్పు.. పోలింగ్, కౌంటింగ్ తేదీలు ఇవే!
ఏపీలో MPTC, ZPTC ఎన్నికల తేదీలు మార్పు.. పోలింగ్, కౌంటింగ్ తేదీలు ఇవే!
హైదరాబాద్ నుంచి అండమాన్ టూర్ ప్యాకేజీ.. 7 రోజుల్లో ఈ అందమైన దీవుల
హైదరాబాద్ నుంచి అండమాన్ టూర్ ప్యాకేజీ.. 7 రోజుల్లో ఈ అందమైన దీవుల
ఇన్‌స్టాలో రోనాల్డ్ ఫాలో చేసే ఏకైక భారతీయుడు ఎవరో తెలుసా..?
ఇన్‌స్టాలో రోనాల్డ్ ఫాలో చేసే ఏకైక భారతీయుడు ఎవరో తెలుసా..?
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా..? మీకు తెలియని ఈ నిజాలు..
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా..? మీకు తెలియని ఈ నిజాలు..
టోలెడో ప్రావిన్స్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ..
టోలెడో ప్రావిన్స్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ..
అయోధ్య రామమందిరానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి..
అయోధ్య రామమందిరానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి..
82 ఏళ్ల వయసులోనూ తగ్గని దాదీ జోరు..!
82 ఏళ్ల వయసులోనూ తగ్గని దాదీ జోరు..!
APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నవంబర్ 9వరకు అప్లై చేయండి
APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నవంబర్ 9వరకు అప్లై చేయండి