IND vs AUS: ఊపిరి పీల్చుకున్న భారత బౌలర్లు.. ఎట్టకేలకు ఆసీస్ ఆలౌట్.. బుమ్రా ఖాతాలో 4 వికెట్లు
Australia vs India, 4th Test: ఎంసీజీ వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 474 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా తరపున స్టీవ్ స్మిత్ 140 పరుగులు చేయగా, యువ ఓపెనర్ సామ్ కాన్‌స్టాన్స్ 60, ఉస్మాన్ ఖవాజా 57, మార్నస్ లాబుషాగ్నే 72 పరుగులు చేశారు. కెప్టెన్ పాట్ కమిన్స్ (49 పరుగులు) ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు.
Australia vs India, 4th Test: భారత్‌తో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 474 పరుగులకు ఆలౌట్ అయింది. 311/6 స్కోరుతో శుక్రవారం ఆట ప్రారంభించిన కంగారు జట్టు చివరి 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా తరపున స్టీవ్ స్మిత్ 140 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, యువ ఓపెనర్ సామ్ కాన్‌స్టాన్స్ (60 పరుగులు), ఉస్మాన్ ఖవాజా (57 పరుగులు), మార్నస్ లాబుషాగ్నే (72 పరుగులు) అర్ధ సెంచరీలు చేశారు. కెప్టెన్ పాట్ కమిన్స్ 49 పరుగులు చేశాడు.
భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశాడు. ఆకాశ్ దీప్ 2 వికెట్లు, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశారు. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో రోజు మ్యాచ్‌లో రెండో సెషన్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టనుంది.
ఇరు జట్లు..
Innings Break!
Australia are all out for 474 runs.
4/99 – Jasprit Bumrah 3/78 – Ravindra Jadeja
Scorecard – https://t.co/MAHyB0FTsR… #AUSvIND pic.twitter.com/IHyCweNUV1
— BCCI (@BCCI) December 27, 2024
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాన్స్, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..