AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు కలెక్టర్.. ఆ బ్యూటీ ఎవరంటే..

సినీరంగంలోకి చైల్డ్ ఆర్టిస్టుగా ప్రవేశించింది. ఆ తర్వాత నటిగా ఎన్నో ఆఫర్స్ అందుకుంటూ అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే నటనకు స్వస్తి చెప్పి యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యింది. చివరకు విజయం సాధించింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Tollywood: ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు కలెక్టర్.. ఆ బ్యూటీ ఎవరంటే..
Hs Keerthana
Rajitha Chanti
|

Updated on: Dec 27, 2024 | 7:38 PM

Share

నటిగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో సినీరంగంలో అడుగుపెడతారు చాలా మంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంటారు. కానీ కొందరు మాత్రం అనుకోకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు. నటీనటులుగా అడియన్స్ హృదయాల్లో చోటు దక్కించుకుంటారు. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే తమ కలల కోసం యాక్టింగ్ నుంచి తప్పుకుంటారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఒకప్పుడు ఇండస్ట్రీలో అగ్రకథానాయిక. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ IAS ఆఫీసర్ కావాలనేది ఆమె కల. అందుకోసమే నటన వదిలి యూపీఎస్సీకి ప్రీపేర్ అయ్యింది. చివరకు విజయం సాధించి కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఆమె మరెవరో కాదు.. హెచ్ ఎస్ కీర్తన.

హెచ్ ఎస్ కీర్తన.. ఈ పేరు చాలా మందికి తెలియదు. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ సివిల్ సర్వీసెస్‌లో చేరాలని ఆమె కల. చివరకు నటనకు స్వస్తి చెప్పి ఐఏఎస్ అధికారిణి అయింది. మలయాళంలో కర్పూరద గొంబే, గంగా-యమునా, ముదిన అలియా, ఉపేంద్ర ఎ వంటి చిత్రాల్లో నటించింది. అప్పట్లో తనదైన నటనతో మెప్పించి జనాలకు దగ్గరయ్యింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఆరు ప్రయత్నాల తర్వాత UPSC పరీక్షలో AIR 167 ర్యాంకింగ్‌ను సాధించింది.

నివేదికల ప్రకారం IAS అధికారి కావడానికి ముందు, HS కీర్తన్ కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (KAS) పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 2 సంవత్సరాలు KAS అధికారిగా పనిచేశారు. నటిగా కెరీర్ మంచి ఫాంలో దూసుకుపోతున్న సమయంలో ధైర్యం చేసి రిస్క్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ కావాలనే తన కలను నెరవేర్చుకుంది. చివరకు UPSC పరీక్షలో విజయం సాధించి కలెక్టర్ గా విధులు నిర్వహిస్తుంది.

Keerthana

Keerthana

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.