అంత‌ర్జాతీయ విమానాలపై సెప్టెంబ‌ర్‌ 30 వ‌ర‌కు నిషేధం

అంత‌ర్జాతీయ విమానాల రాక‌పోక‌ల‌పై నిషేధాన్ని మరోసారి పొడిగించారు. క‌మ‌ర్షియ‌ల్ ప్యాసింజ‌ర్ ఫ్ల‌యిట్ల‌పై నిషేధాన్ని సెప్టెంబ‌ర్‌ 30వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్రకటించింది. కార్గో విమానాల‌కు మాత్రం ఇది వ‌ర్తించ‌దు అని కేంద్ర విమానయాన శాఖ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

అంత‌ర్జాతీయ విమానాలపై సెప్టెంబ‌ర్‌ 30 వ‌ర‌కు నిషేధం
Follow us

|

Updated on: Aug 31, 2020 | 2:13 PM

నెలలు గడుస్తున్న కరోనా ప్రభావం మాత్రం ఎంతమాత్రం తగ్గడంలేదు. రికార్డుస్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అయ్యినప్పటికీ కరోనా కట్టడిలో భాగంగా భారాన్ని సైతం భరిస్తున్నాయి. ఇందులో భాగంగా అంత‌ర్జాతీయ విమానాల రాక‌పోక‌ల‌పై నిషేధాన్ని మరోసారి పొడిగించారు. క‌మ‌ర్షియ‌ల్ ప్యాసింజ‌ర్ ఫ్ల‌యిట్ల‌పై నిషేధాన్ని సెప్టెంబ‌ర్‌ 30వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్రకటించింది. కార్గో విమానాల‌కు మాత్రం ఇది వ‌ర్తించ‌దు అని కేంద్ర విమానయాన శాఖ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. డీజీసీఏ అనుమ‌తి ఉన్న విమానాల‌కు కూడా ఈ నిబంధ‌న వ‌ర్తించ‌దని స్పష్టం చేసింది. ఎంపిక చేసిన రూట్ల‌లో మాత్రమే అధికారిక అనుమ‌తి పొందిన అంత‌ర్జాతీయ విమానాల‌కు అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు వెల్లడించారు. అయితే, విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయుల‌ను తీసుకువ‌చ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చేపట్టిన వందేభార‌త్ మిష‌న్ యధావిథిగా కొనసాగనుంది. సెప్టెంబ‌ర్ ఒక‌ట తేదీ నుంచి 31 వ‌ర‌కు ఆర‌వ ద‌శ వందేభార‌త్ మిష‌న్ చేప‌ట్ట‌నున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎయిర్ ఇండియా రిలీజ్ చేసింది.