India Corona Cases : దేశంలో కొత్తగా 26,624 పాజిటివ్ కేసులు..యాక్టీవ్ కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి

ఇండియాలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లే కనిపిస్తోంది. తాజాాగా శనివారం 11,07,681 వైరస్ నిర్ధారణ టెస్టులు చేయగా.. 26,624 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

India Corona Cases : దేశంలో కొత్తగా 26,624 పాజిటివ్ కేసులు..యాక్టీవ్ కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి
Follow us

|

Updated on: Dec 20, 2020 | 11:45 AM

ఇండియాలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లే కనిపిస్తోంది. తాజాాగా శనివారం 11,07,681 వైరస్ నిర్ధారణ టెస్టులు చేయగా.. 26,624 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,00,31,223కు చేరింది. మరోవైపు, శనివారం 341 మంది మరణించగా.. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,45,477కి చేరింది.  ఇక కొత్తగా 29,960 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 95,80,402కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,05,344 యాక్టీవ్ కేసులున్నాయి. కరోనా రికవరీ రేటు 95.46 శాతానికి చేరగా..డెత్ రేటు 1.45 శాతంగా ఉంది.

కాగా కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉన్నందన అశ్రద్ద చేస్తే..మహమ్మారి మళ్లీ విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Also Read :

Tirumala Tirupati : శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల జారీ వివాదం..భక్తుల ఆందోళన..స్పందించిన టీటీడీ

Road Accident : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం..రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్లెదుటే ఇద్దరు చిన్నారులు మృతి

కృష్ణా జిల్లా రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్ ..వివరాలు దిగువ వీడియోలో