కోవిడ్ రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోకండి, అలెర్జీ రోగులకు అమెరికన్ హెల్త్ సంస్థ హెచ్ఛరిక, ఖచ్చితమైన గైడ్ లైన్స్ జారీ

అమెరికాలో ఫైజర్, బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్లలో ఒకరు అలెర్జీతో బాధ పడుతూ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టు వచ్చిన వార్తలపై అక్కడి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ..

కోవిడ్ రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోకండి, అలెర్జీ రోగులకు అమెరికన్ హెల్త్ సంస్థ హెచ్ఛరిక,  ఖచ్చితమైన గైడ్ లైన్స్ జారీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 20, 2020 | 11:51 AM

అమెరికాలో ఫైజర్, బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్లలో ఒకరు అలెర్జీతో బాధ పడుతూ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టు వచ్చిన వార్తలపై అక్కడి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ అప్రమత్తమైంది. ముఖ్యంగా అలెర్జీతో బాధ పడేవారిని హెచ్చరించింది. వారు రెండో డోసు టీకామందు తీసుకోరాదని సూచించింది. మొదటి డోసు తీసుకున్నవారెవరైనా ఇలా అలెర్జీతో బాధ పడితే ఇక రెండో డోసు తీసుకోరాదని, తెలియకుండా తీసుకున్న పక్షంలో తీవ్ర అనారోగ్యానికి గురి కావచ్చునని ఈ సంస్థ పేర్కొంది. కరోనా వ్యాక్సినేషన్ కు సంబంధించి అలెర్జిక్ రియాక్షన్ ని మేం మానిటర్ చేస్తున్నాం., ఏ అలెర్జీ లేనివారు ఈ టీకామందు తీసుకో వచ్చు అని నిపుణులు తెలిపారు. ఫైజర్, బయో ఎన్ టెక్ వ్యాక్సిన్లను,  మోడెర్నా టీకామందును అమెరికా ప్రభుత్వం అనుమతించిన సంగతి విదితమే.

దేశంలో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఇప్పటివరకు ఐదు అలెర్జిక్ రియాక్షన్ కేసులు బయటపడ్డాయి. వీటిపై ఈ సంస్థ ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ఇలా ఉండగా రోగ నిరోధక శక్తిని పెంపొందించే యత్నంలో భాగంగా చైనా ఈ శీతాకాల సీజన్ లో హైరిస్క్ గ్రూపులకు టీకామందు ఇచ్ఛే కార్యక్రమాన్ని చేబట్టింది. కోల్డ్ స్టోరేజీ ఫుడ్ కేంద్రాల్లో పని చేసే వారికి తాము తొలుత దీన్ని ఇస్తామని చైనాలోని హెల్త్ కమిషన్ ప్రకటించింది.