Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశ వ్యాప్తంగా గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. రాజస్థాన్‌లో సరికొత్త రికార్డ్.. కశ్మీర్‌లో మరీ దారుణం..

దేశం వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు దారుణంగా పడిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు

దేశ వ్యాప్తంగా గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. రాజస్థాన్‌లో సరికొత్త రికార్డ్.. కశ్మీర్‌లో మరీ దారుణం..
Shiva Prajapati
|

Updated on: Dec 20, 2020 | 12:06 PM

Share

దేశం వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు దారుణంగా పడిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తాజాగా హస్తినా 3-4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక దక్షణాదిలోనూ అదే పరిస్థితి నెలకొంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి పంజా విసురుతోంది. జనం చలికి వణికిపోతున్నారు. పొగమంచు కప్పేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నేడు దేశ రాజధాని ఢిల్లీలో ఈ సీజన్లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇవాళ ఉదయం 3.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రాజస్థాన్‌లో అయితే పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఎన్నడూ లేని విధంగా మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మౌంట్ అబూ వద్ద మైనస్ 1 డిగ్రీ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యింది. దాంతో అక్కడ నీరు గడ్డకట్టింది. కొన్ని చోట్ల కాలువులు, నీటి గుంటలపై మంచు తెరలు ఏర్పడ్డాయి. అయితే రాజస్థాన్‌లో ఈ తరహా పరిస్థితి చూడటం ఇదే తొలిసారి అని పర్యాటకులు చెబుతున్నారు.

ఇక జమ్మూకశ్మీర్‌లో అయితే పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవాళ జమ్మూకశ్మీర్‌లో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. శ్రీనగర్‌లో మైనస్ 6.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఖాజీగండ్- మైనస్ 5.7, ఫహల్‌గామ్- మైనస్ 7.7, కుప్వారా- మైనస్ 5.6, గుల్‌మర్గ్-మైనస్ 7.5, అనంత్‌నాగ్- మైనస్ 5.7, గండెర్బల్- మైనస్ 4.0, లేహ్ – మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Also read:

Political crisis in Nepal: నేపాల్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం.. పార్లమెంట్‌ను రద్దు చేసిన ప్రధాని కేపీ శర్మ ఓలి..

డ్రగ్స్ కేసులో బీజేపీ నేత, కోర్టు తీర్పుపై అసంతృప్తితో బ్రేవరీ అవార్డును తిరిగి ఇచ్ఛేసిన మణిపూర్ పోలీసు అధికారిణి.

డ్రైవింగ్‌ లైసెన్స్‌లో ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారో తెలుసా?
డ్రైవింగ్‌ లైసెన్స్‌లో ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారో తెలుసా?
అతడికి 19, ఆమెకు 38..వింత లవ్ స్టోరీ వీడియో
అతడికి 19, ఆమెకు 38..వింత లవ్ స్టోరీ వీడియో
బిస్కెట్లు కూడా తింటున్నారా? ఈ అలవాటును త్వరగా మానేయండి
బిస్కెట్లు కూడా తింటున్నారా? ఈ అలవాటును త్వరగా మానేయండి
భర్త నాలుకను కొరికి నమిలేసిన భార్య.. ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్
భర్త నాలుకను కొరికి నమిలేసిన భార్య.. ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్
నడిరోడ్డులో గుర్రాల ఘర్షణ.. ఆ తర్వాత ఏమైందంటే వీడియో
నడిరోడ్డులో గుర్రాల ఘర్షణ.. ఆ తర్వాత ఏమైందంటే వీడియో
వంటకు అల్యూమినియం పాత్రల కంటే ఇత్తడి పాత్రలు మంచివి.. ఎందుకంటే
వంటకు అల్యూమినియం పాత్రల కంటే ఇత్తడి పాత్రలు మంచివి.. ఎందుకంటే
పసుపు, ఆకుపచ్చ, తెలుపు... ఏ గుమ్మడికాయ ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
పసుపు, ఆకుపచ్చ, తెలుపు... ఏ గుమ్మడికాయ ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు.. కొన్ని గంటల్లోనే రేట్లు తారుమారు..
మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు.. కొన్ని గంటల్లోనే రేట్లు తారుమారు..
రెండో పెళ్లికి రెడీగా సమంత..ప్లాన్ మాములుగా లేదుగా వీడియో
రెండో పెళ్లికి రెడీగా సమంత..ప్లాన్ మాములుగా లేదుగా వీడియో
1000కి పైగా సినిమాలు.. ప్రతి పాత్రకు ప్రాణం పోసింది..
1000కి పైగా సినిమాలు.. ప్రతి పాత్రకు ప్రాణం పోసింది..