మరోసారి 50 వేలు దాటిన కరోనా కేసులు, తస్మాత్ జాగ్రత్త

దేశంలో కరోనా వైరస్ మళ్లీ ప్రమాదకరంగా విస్తరిస్తోంది. ఇటీవల వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా..తాజాగా కేసులు సంఖ్య పెరిగింది.

మరోసారి 50 వేలు దాటిన కరోనా కేసులు, తస్మాత్ జాగ్రత్త
Follow us

|

Updated on: Nov 05, 2020 | 11:18 AM

దేశంలో కరోనా వైరస్ మళ్లీ ప్రమాదకరంగా విస్తరిస్తోంది. ఇటీవల వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా..తాజాగా కేసులు సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 50,210 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 704 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది.  దేశంలో  ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 83,64,086 కు చేరింది.  మొత్తం 1,24,315 మంది ప్రాణాలు కోల్పోయారు.  వైరస్ బారి నుంచి  77,11,809 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 5,27,962 యాక్టీవ్ కేసులున్నాయి.  వైరస్ బారినపడి కోలుకున్న వారి శాతం 92.20గా ఉంది. బుధవారం దేశవ్యాప్తంగా 12,09,425 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..మొత్తం టెస్టుల సంఖ్య 11,42,08,384కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  తెలిపింది.

Also Read :

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ !

ఏపీ : స్కూళ్లలో కరోనా వ్యాప్తి, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు

‘ఆంటీ’ అని పిలిచినందుకు వీర బాదుడు బాదింది

తిరుపతిలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు