యోగి ఆదిత్యనాథ్ ఫై నిప్పులు కక్కిన నితీష్ కుమార్

బీహార్, యూపీ ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, యోగి ఆదిత్యనాథ్ మధ్య రగడ తలెత్తింది. బీహార్ ఎన్నికల ప్రచారంలో వీరి కామెంట్స్ వివాదం రేపాయి. కతిహార్ నియోజకవర్గంలో నిన్న జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన యోగి..

యోగి ఆదిత్యనాథ్ ఫై నిప్పులు కక్కిన నితీష్ కుమార్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 05, 2020 | 11:19 AM

బీహార్, యూపీ ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, యోగి ఆదిత్యనాథ్ మధ్య రగడ తలెత్తింది. బీహార్ ఎన్నికల ప్రచారంలో వీరి కామెంట్స్ వివాదం రేపాయి. కతిహార్ నియోజకవర్గంలో నిన్న జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన యోగి.. సీఏఏ గురించి ప్రస్తావిస్తూ..పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో వేధింపులు ఎదుర్కొంటున్న ముస్లిమేతరుల భద్రత కోసమే మోదీ ప్రభుత్వం ఈ  చట్టం తెచ్చిందన్నారు.అంతటితో ఊరుకోక,, చొరబాటుదారులెవరైనా ఈ దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తే..వారిని గెంటివేస్తామని అన్నారు. సహించే ప్రసక్తి లేదన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన నితీష్ కుమార్, ఎవరు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇదంతా నాన్సెన్స్ ! ఎవరు వారిని గెంటేస్తారు ? ఆ ధైర్యం ఎవరికి ఉంది ? ప్రతివారూ ఈ దేశానికి చెందినవారే.. ప్రతి వ్యక్తీ భారతీయుడే అన్నారు. మనం సామరస్యం, సమైక్యత, సౌభ్రాతృత్వం కోసం కృషి చేస్తున్నామని,. కానీ ఇలాంటివారు విభజించ జూస్తున్నారని ఆయన అన్నారు. వాళ్లకేం పని లేదు అని పరోక్షంగా యోగిపై నిప్పులు కురిపించారు.