ముంబాయి-ఢిల్లీ మధ్య తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నమెంట్‌ అనేక మలుపులు తిరుగుతూ.. అనూహ్య ఫలితాలను చవిచూస్తూ ... ఉత్కంఠత రేపుతూ ఆఖరి దశకు వచ్చేసింది..

ముంబాయి-ఢిల్లీ మధ్య తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌
Follow us

|

Updated on: Nov 05, 2020 | 11:57 AM

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నమెంట్‌ అనేక మలుపులు తిరుగుతూ.. అనూహ్య ఫలితాలను చవిచూస్తూ … ఉత్కంఠత రేపుతూ ఆఖరి దశకు వచ్చేసింది.. ఇవాళ ముంబాయి ఇండియన్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మధ్య తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగబోతున్నది.. గత రికార్డులను, గణాంకాలను పరిశీలిస్తే మాత్రం ముంబాయి ఇండియన్స్‌కే ఫైనల్‌ ఛాన్సులున్నాయని అనిపిస్తోంది.. కానీ టీ-20 మ్యాచ్‌లలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా! ఒక్క ఓవర్‌తో మ్యాచ్‌ స్వరూపం పూర్తిగా మారవచ్చు.. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్‌లలో ముంబాయి టీమ్‌ అయిదుసార్లు ఫైనల్స్‌కు చేరింది. నాలుగుసార్లు టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.. ఇప్పుడు అయిదో కప్పు కోసం ముచ్చటపడుతోంది.. మరోవైపు ముంబాయిని ఎదుర్కోబోతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పటి వరకు ఫైనల్స్‌కు చేరలేదు.. అందుకే ఈసారి సర్వశక్తులు ఒడ్డి విజయం సాధించి తుదిపోరుకు చేరుకోవాలని ఆరాటపడుతోంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ తక్కువేమీ లేదు.. ఆ జట్టులోనూ తురుమ్‌ఖాన్‌లు ఉన్నారు.. కాబట్టి ఇవాళ జరిగే మ్యాచ్‌ ఏకపక్షంగా సాగుతుందనుకోడానికి వీల్లేదు.. కాకపోతే ఢిల్లీ జట్టు ఈ దశకు చేరుకోడానికి అష్టకష్టాలు పడింది.. 14 లీగ్‌ మ్యాచ్‌లలో ఎనిమిదింటిలో గెలిచి, ఆరు మ్యాచ్‌లలో ఓడిపోయింది.. అయితే మొదటి తొమ్మిది మ్యాచ్‌లలో ఏడింటిని గెల్చుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచేసిన ఢిల్లీ ఆ తర్వాత ఎందుకో తడబడింది.. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది.. ఇక తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించడం ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఢిల్లీ టీమ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలు సమతూకంగా ఉన్నాయి.. ఈ జట్టులోని కీలక ఆటగాడు శిఖర్‌ ధావన్‌ ఇప్పటి వరకు 525 పరుగులు చేశాడు.. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, పంత్‌, స్టొయినిస్‌లు కూడా తమ బ్యాట్‌కు పని చెప్పారు.. ఇక బౌలింగ్‌లో రబడ అద్భుతంగా రాణిస్తున్నాడు.. ఈ టోర్నీలో ఇప్పటివరకు పాతిక వికెట్లు తీసుకుని టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. అతనికి అండగా నోర్జే నిలుస్తున్నాడు.. అక్షర్‌ పటేల్‌ చాలా పొదుపుగా బౌలింగ్‌ చేస్తున్నాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ తన అనుభవాన్ని అంతా కనబరుస్తున్నాడు.. అయితే వరుసగా నాలుగు ఓటములు చవి చూసిన తర్వాత కానీ ఢిల్లీ టీమ్‌లో ఉన్న బలహీనతలు బయటపడలేదు.. దూకుడుగా ఆడేవారు ఒక్కరు కూడా లేరు.. అసలు టీ-20 అంటేనే సిక్స్‌లు, ఫోర్‌లు.. బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు బాదే బ్యాట్స్‌మెన్‌ లేరు. ఓపెనర్లు కుదురుగా నిల్చోవడం లేదు.. ఈ బలహీనతను అధిగమిస్తే ఢిల్లీకి ఎదురుండదు..

ఇక ముంబాయి ఇండియన్స్‌ విషయానికి వస్తే లీగ్‌ దశలో ఆడిన 14 మ్యాచ్‌లలో తొమ్మిది మ్యాచ్‌లను గెల్చుకుంది. అయిదు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఇందులో రెండు సార్లు సూపర్‌ ఓవర్‌లోనే ఓటమి చెందింది. ముంబాయికి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌ ఉంది.. ఆటగాళ్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు.. ఒకరు త్వరగా పెవిలియన్‌కు చేరినా ఆ బాధ్యతను మరొకరు మోస్తున్నారు. డికాక్, సూర్యకుమార్, ఇషాన్‌ కిషన్‌లు చక్కగా రాణిస్తున్నారు. ఈ ముగ్గురు ఇప్పటికే 400 పరుగులకు పైగా సాధించారు.. పోలార్డ్‌, హార్దక్‌ పాండ్యాలు చెలరేగితే ఆపడం కష్టం.. బౌలింగ్‌లోనూ బలంగానే ఉంది. బుమ్రా, బౌల్ట్‌లు అద్భుతంగా బౌలింగ్‌ చేస్తూ ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడుతున్నారు.. బుమ్రా ఆల్‌రెడీ 23 వికెట్లు తీసుకున్నాడు.. బౌల్డ్‌ కూడా 20 వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్‌శర్మ ఆడతాడా ? గాయం తీవ్రత పెరగకుండా విశ్రాంతి తీసుకుంటాడా అన్నది సస్పెన్స్‌గా ఉంది. మొన్న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ ఏదో పంతం కొద్దీ ఆడినట్టు అనిపించింది.. మైదానంలో చురుగ్గా కదలలేకపోయాడు.. ఇక ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు రెండుసార్లు తలపడ్డాయి.. రెండుసార్లూ ముంబాయే గెలిచింది.

ముంబాయి ఇండియన్స్‌ తుది జట్టు (అంచనా): రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), డికాక్, సూర్యకుమార్, ఇషాన్‌ కిషన్, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, పొలార్డ్, ప్యాటిన్సన్, రాహుల్‌ చహర్, బుమ్రా, బౌల్ట్‌.

ఢిల్లీ క్యాపిటల్స్‌ తుది జట్టు (అంచనా): శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), పృథ్వీ షా, ధావన్, రహానే, పంత్, స్టొయినిస్, అక్షర్, అశ్విన్, స్యామ్స్‌ లేదా హెట్‌మైర్, రబడ, నోర్జే.

లాస్ట్‌ ఇయర్‌ జరిగిన ఐపిఎల్‌లోనూ ముంబాయి ఇండియన్స్‌ అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. ఢిల్లీ, చెన్నైలతో పాటు సమంగా 18 పాయింట్లు సాధించినప్పటికీ మెరుగైన రన్‌రేట్‌తో టేబుల్‌ టాప్‌లోకి చేరింది.

క్వింటన్‌ డికాక్‌ (529 పరుగులు) జోరు కనబరిచాడు. ఎప్పటిలాగే బుమ్రా (19 వికెట్లు) కీలక పాత్ర పోషించాడు. చిదంబరంలో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో చెన్నైని 6 వికెట్ల తేడాతో ఓడించింది ముంబయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన ధోనీసేనను 131/4కే పరిమితం చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (71*) అజేయంగా నిలవడంతో 18.3 ఓవర్లకే ఛేదనను పూర్తిచేసి ఫైనల్‌కు చేరుకుంది. క్వాలిఫయర్‌-2లో దిల్లీపై గెలిచిన చెన్నైని మళ్లీ ఫైనల్లో ఓడించింది. నిజానికి ఈ ఫైనల్లో అనుభవించిన ఉత్కంఠ గురించి ఎంత చెప్పినా తక్కువే. పొలార్డ్‌ (41*; 25 బంతుల్లో 3×4, 3×6) అండతో మొదట ముంబయి 149/9 పరుగులే చేసింది. మందకొడిగా ఉన్న ఉప్పల్‌ పిచ్‌పై పరుగు తేడాతో విజయం సాధించింది. షేన్‌ వాట్సన్‌ (80) భయపెట్టినా జస్ప్రీత్‌ బుమ్రా (2/14), రాహుల్‌ చాహర్‌ (1/14) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. చెన్నైకి 12 బంతుల్లో 18 పరుగులు అవసరం కాగా 19వ ఓవర్లో బ్రావోను ఔట్‌ చేసిన బుమ్రా 9 పరుగులే ఇచ్చాడు. ఆఖరి ఓవర్లో.. వాట్సన్‌ రనౌట్‌ కావడం, శార్దూల్‌ ఠాకూర్‌ను మలింగ ఔట్‌ చేయడంతో ముంబయి ట్రోఫీని ముద్దాడింది.

పుణెపైనా.. ఒక్క పరుగుతోనే

2017లో ముంబయి 10 విజయాలు 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. క్వాలిఫయర్‌-1లో పుణె చేతిలో 20 పరుగుల తేడాతో ఓడింది. ఛేదనలో పార్థివ్‌ (52) మినహా మరెవ్వరూ 16కు మించి స్కోరు చేయలేదు. అయితే క్వాలిఫయర్‌-2లో కోల్‌కతాపై తిరుగులేని విజయం సాధించి బెంబేలెత్తించింది. కర్ణ్‌శర్మ (4/16), బుమ్రా (3/7) గంభీర్‌ సేనను 107కే కుప్పకూల్చారు. ఆ తర్వాత 14.3 ఓవర్లకే రోహిత్‌సేన ఛేదన పూర్తి చేసేసింది. ఇక ఫైనల్లో పుణెపై మళ్లీ ఒక్క పరుగు తేడాతోనే గెలిచి టైటిల్‌ కొట్టేసింది. దీనికీ ఉప్పల్‌ మైదానమే వేదిక కావడం గమనార్హం. కృనాల్‌ పాండ్య (47) రాణించడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగి 129/8 పరుగులే చేసింది. అయితే మిచెల్‌ జాన్సన్‌ (3/26), బుమ్రా (2/26), కర్ణ్‌శర్మ ఛేదనలో పుణె ఆటలు సాగనివ్వలేదు. స్మిత్‌ (51), రహానె (44) మెరిసినా 128కే కట్టడి చేశారు. పుణె విజయానికి ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా మనోజ్‌ తివారీ (7), స్మిత్‌ను జాన్సన్‌ వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చాడు. ఆఖరి బంతికి 4 పరుగులు అవసరం కాగా 2 పరుగులు అవ్వగానే డాన్‌ క్రిస్టియన్‌ రనౌట్‌ అయ్యాడు. ముంబయి గెలిచింది.

చెన్నై చిత్తు..

2015లో ముంబయి 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. క్వాలిఫయర్స్‌లో చెన్నైని 25 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 188 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆ జట్టును 19 ఓవర్లలో 162కే చిత్తుచేసింది. ధోనీ డకౌట్‌ అయ్యాడు. అయితే క్వాలిఫయర్స్‌-2లో బెంగళూరుపై చెన్నై గెలిచింది. ఈ సారి ఆ జట్టును మరింత చిత్తుగా ఓడించింది రోహిత్‌ సేన. ఈడెన్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగి 202/5 పరుగులు చేసింది. సిమన్స్‌ (68), రోహిత్‌ (50), పొలార్డ్‌ (36), రాయుడు (36*) అదరగొట్టారు. లసిత్‌ మలింగ (2/25), మెక్లెనగన్‌ (3/25), హర్భజన్‌ (2/34) దెబ్బకు ధోనీసేన 161/8కే పరిమితమైంది. డ్వేన్‌ స్మిత్‌ (57) టాప్‌ స్కోరర్‌. ధోనీ (18) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ముంబయి ఎంత ధాటిగా బౌలింగ్‌ చేసిందంటే.. 15 ఓవర్లకే చెన్నై ఓటమి ఖరారైపోయింది.

మరోసారీ.. చెన్నైకి అదే గతి

2013లో చెన్నై, ముంబయి 11 విజయాలు 22 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచి క్వాలిఫయర్‌-1లో తలపడ్డాయి. ఈ పోరులో ముంబయికి ఘోర పరాభవం ఎదురైంది. చెన్నై నిర్దేశించిన 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 48 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ధోనీసేనలో మైకెల్‌ హస్సీ (86*), సురేశ్‌ రైనా (82*) అజేయంగా నిలిచారు. అయితే క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్‌ను ఓడించిన ముంబయి ఫైనల్లో చెన్నైపై కసిగా ప్రతీకారం తీర్చుకుంది. తమకు అచ్చొచ్చిన ఈడెన్‌లో తొలి టైటిల్‌ను ముద్దాడింది. మొదట ముంబయి 148/9కే పరిమితమైంది. కీరన్‌ పొలార్డ్‌ (60), అంబటి రాయుడు (37) మినహా మిగిలినవారు రాణించలేదు. బ్రావో 4 వికెట్లతో చెలరేగాడు. అయితే ఛేదనలో లసిత్‌ మలింగ (2), మిచెల్‌ జాన్సన్‌ (2), హర్భజన్‌ సింగ్‌ (2) సమష్టిగా అదరగొట్టారు. ధోనీసేనను 125/9కే పరిమితం చేశారు. ధోనీ (63*), మురళీ విజయ్‌ (18), డ్వేన్‌ బ్రావో (15) టాప్‌ స్కోరర్లు.

తొలిసారి పరాజయం

2010లోనూ ముంబయి వీరవిహారం చేసింది. 10 మ్యాచులు గెలిచి 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. జట్టు కెప్టెన్‌ సచిన్‌ తెందూల్కర్‌ (618 పరుగులు) అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. తిరుగులేని ఫామ్‌లో కనిపించాడు. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ లేవు. తొలి సెమీస్‌లో బెంగళూరును 35 పరుగుల తేడాతో ఓడించి ముంబయి ఫైనల్‌ చేరుకుంది. మరో సెమీస్‌లో డెక్కన్‌ను ఓడించిన చెన్నైతో ఫైనల్లో తలపడింది. రైనా (57) ధాటిగా ఆడటంతో తొలుత ధోనీసేన 168/5 పరుగులు చేసింది. ఛేదనలో ఈ మ్యాచ్‌ మలుపులు తిరిగింది. సచిన్‌ (48) ఉన్నంత వరకు ముంబయి గెలుస్తుందనే అనిపించింది. మరోవైపు వరుస వికెట్లు పడటంతో మాస్టర్‌పై ఒత్తిడి పెరిగింది. దూకుడుగా ఆడాల్సి రావడంతో జకాతి బౌలింగ్‌లో ఔటయ్యాడు. అభిషేక్‌ నాయర్‌ (27), పొలార్డ్‌ (27; 10 బంతుల్లో) ఎంత ప్రయత్నించినా ఓటమి తప్పలేదు. 146/9కే పరిమితమైంది. అయితే ప్లేఆఫ్స్‌ ప్రవేశ పెట్టాక ఫైనల్‌ చేరిన ప్రతిసారీ ముంబయి విజయఢంకా మోగించింది. మరి ఈ సారి ఏం చేస్తుందో చూడాలి.

యూఏఈలో జరుగుతున్న టీ20 లీగ్‌ అత్యంత కీలక దశకు చేరుకుంది. నాలుగు ప్రధాన జట్లు ప్లేఆఫ్స్‌కు చేరగా అందులో ఒకటి బెంగళూరు నిలిచింది. నాలుగేళ్ల తర్వాత ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరడం విశేషం. 2016లో చివరిసారి ఫైనల్‌ చేరినా కోహ్లీసేన తృటిలో కప్పు చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఇన్నాళ్లకు ఆ అవకాశం దక్కింది. అయితే, ఈసారైనా బెంగళూరు విజయం సాధిస్తుందా? కెప్టెన్‌ కోహ్లీ సత్తా చూపిస్తాడా అనేది ఆసక్తిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ నేడు 32వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా అతడి ఆటతీరు, బెంగళూరు విజయావకాశాలను తెలుసుకుందాం..

వరసగా రాణించి.. ఇబ్బందులు పడుతున్నాడు.. ఈ ఏడాది ఆరంభంలో కోహ్లీ ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు. టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌ పర్యటనలో దారుణంగా విఫలమయ్యాడు. ఇక లాక్‌డౌన్‌ తర్వాత నేరుగా టీ20 లీగ్‌లో అడుగుపెట్టిన అతడు మొదటి మూడు మ్యాచ్‌ల్లోనూ రాణించలేకపోయాడు. దీంతో అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. అయితే, వరుసగా రాజస్థాన్‌(72), దిల్లీ(43), చెన్నై(90*), కోల్‌కతా(33*), పంజాబ్‌(48), రాజస్థాన్‌(43), చెన్నై(50) జట్లపై రాణించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలా ఈ సీజన్‌లోనూ తన పరుగుల ప్రవాహం కొనసాగించాడు. ఇప్పటివరకు 14 మ్యాచ్‌ల్లో 460 పరుగులు చేసి 46 సగటుతో కొనసాగుతున్నాడు. కానీ లీగ్‌ దశ ముగిసే సరికి మళ్లీ విఫలమయ్యాడు. గత మూడు మ్యాచ్‌ల్లో ముంబయి(8), హైదరాబాద్‌ (7), దిల్లీ (29)లపై తక్కువ పరుగులు సాధించి ఇబ్బందులు పడ్డాడు.

బెంగళూరు గెలవాలంటే.. కోహ్లీ మెరవాలి.. కోహ్లీసేన లీగ్‌ దశలో ఎలాగో నెట్టుకొచ్చినా ఇప్పుడే అసలైన సవాలు ఎదురుకానుంది. హైదరాబాద్‌ గత మూడు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదుండగా, బెంగళూరు గత నాలుగు మ్యాచ్‌లు ఓటమిపాలై నిరాశలో ఉంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రెండు జట్లు ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడనున్నాయి. ఇక బెంగళూరు ఓపెనర్లలో పడిక్కల్‌ నిలకడగా రాణిస్తున్నా అతడికి సరైన జోడీ లేకపోయింది. మరోవైపు తర్వాత వచ్చే విరాట్‌ ఇకపై రెచ్చిపోవాల్సిన అవసరం ఉంది. అతడికి డివిలియర్స్‌ మెరుపులు తోడైతే పెద్ద కష్టమేమీ కాదు. లేదంటే ఎలిమినేటర్‌ మ్యాచ్‌ నుంచే ఇంటిముఖం పట్టాలి. ఒకవేళ అదే పరిస్థితి వస్తే కోహ్లీ మరో ఆరు నెలలు ఈ టీ20 లీగ్‌ కోసం వేచిచూడాలి. దాంతో అభిమానులు మరోసారి నిరాశ చెందుతారు. అదృష్టం కొద్దీ ఈ మ్యాచ్‌లో గెలుపొందినా క్వాలిఫయర్‌ 2లో ముంబయి, లేదా దిల్లీతో తలపడాలి. ఆ రెండు జట్లు బలంగానే కనిపిస్తుండడంతో వాళ్లపై గెలుపొందడం కూడా కష్టమే.

ఫైనల్‌ చేరినా అంత తేలిక కాదు.. అన్ని అడ్డంకులు తట్టుకొని ఫైనల్‌కు చేరినా బెంగళూరుకు విజయం అంత తేలిక కాదు. సరైన ప్రణాళికతో పాటు కచ్చితమైన సమష్టితత్వం రావాలి. ఎందుకంటే ఇప్పుడు ప్లేఆఫ్స్‌ చేరిన మిగతా జట్లన్నీ బెంగళూరు కంటే బలంగానే ఉన్నాయి. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో రాణిస్తున్నాయి. ఎప్పటిలాగే కోహ్లీసేనకు ఈసారి బ్యాటింగే ప్రధాన బలం. అయితే బౌలర్లు కూడా తమ వంతు ప్రదర్శన చేస్తుండటం కాస్త ఊరటనిచ్చే అంశం. కానీ చివరి నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయిన పరిస్థితి చూస్తుంటే కాస్త ఆందోళనగా అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విరాట్‌ ఆ జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి. మరోవైపు కరోనా వైరస్‌ కారణంగా ఆరు నెలలు వాయిదా పడిన మెగా టీ20 లీగ్‌ ఇప్పుడు యూఏఈలో జరుగుతుండగా ప్లేఆఫ్స్‌ సమయంలోనే అతడి పుట్టిన రోజు కలిసి రావడం గమనార్హం. మరి ఈ ఏడాదైనా కింగ్‌ కోహ్లీకి మంచి జరిగి తన చిరకాల కల నేరవేరుతుందా లేదా చూడాల్సి ఉంది. హ్యాపీ బర్త్‌డే విరాట్‌..!

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి