AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan Card: పాన్ కార్డులో వివరాలు తప్పుగా పడ్డాయా..? నో టెన్షన్.. మొబైల్‌లోనే నిమిషాల్లో మార్చుకోండిలా..

పాన్ కార్డులో వివరాలు తప్పుగా ఉన్నాయా.. అయితే పాన్ కార్డ్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంట్లోనే ఉండి నిమిషాల్లో పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ అవకాశం కల్పిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా ఎలా చేసుకోవాలంటే..?

Pan Card: పాన్ కార్డులో వివరాలు తప్పుగా పడ్డాయా..? నో టెన్షన్.. మొబైల్‌లోనే నిమిషాల్లో మార్చుకోండిలా..
Pan Card
Venkatrao Lella
|

Updated on: Feb 16, 2026 | 8:40 AM

Share

దేశంలోని నివసిస్తున్న ప్రతీఒక్కరికీ ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమో.. పాన్ కార్డు కూడా అంతే అవసరం. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ వరకు.. ఇలా చాలా ఆర్ధిక వ్యవహారాలకు ఇది ముఖ్యమైన డాక్యుమెంట్. అంతేకాకుండా ఒక ప్రభుత్వం గుర్తింపు ధృవీకరణ పత్రంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక లోన్ తీసుకోవాలన్నా, స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌ లాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టాలన్నా పాన్ అవసరం. బ్యాంక్ అకౌంట్‌లో రూ.50 వేల కంటే ఎక్కువ డిపాజిట్ చేయాలన్నా పాన్ ఉపయోగపడుతుంది. అందుకే పాన్‌లోని వివరాలన్నీ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే మీరు ఆర్ధిక సేవలు పొందటంలో ఇబ్బంది పడవచ్చు. మీరు ఇంటి వద్ద నుంచే సులువుగా పాన్ కార్డులోని వివరాలు మార్చుకోవచ్చు. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.

తప్పులు సరిద్దుకోవడం ఎలా..?

-ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఎన్ఎస్‌డీఎల్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి

-పాన్ కార్డ్ సర్వీసెస్ ఆన్‌లైన్ ఆప్షన్‌ను ఎంచుకోండి

-సెలక్ట్ పాన్ అప్లికేషన్ టైప్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-చేంజెస్ లేదా కరెక్షన్ ఇన్ ఎగ్జిటింగ్ పాన్ డేటా ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి

-అప్లికేషన్ కేటగిరీకి వెళ్లండి

-మీ పేరు, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడీ, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి

-సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి

-కరెక్షన్ చేసుకోవాల్సిన వివరాలను నమోదు చేయండి

-అవసరమైన డాక్యుమెంట్ నిర్ధారణ కోసం సమర్పించండి

-ఆ తర్వాత పేమెంట్ మోడ్‌లోకి వెళుతుంది

-అప్డేట్ చేసుకోవడానికి చెల్లించాల్సిన ఫీజును ఆన్ లైన్ ద్వారా చెల్లించండి

-పేమెంట్ చేశాక వివరాలు అప్డేట్ అవుతాయి

-అనంతరం పీడీఎఫ్ పైల్‌ను డౌన్ లోడ్ చేసుకోండి

-అధికారులు వెరిఫై చేసి మీ వివరాలను అప్డేట్ చేస్తారు

-పోస్ట్ ద్వారా మీరు కొత్త పాన్ కార్డును పొందుతారు

అప్డేట్ చేసుకోవడం ఎందుకు అవసరం

ఆధార్ కార్డులో ఒకలా.. పాన్ కార్డులో మరోలా వివరాలు ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే ఆధార్, పాన్ వివరాలు ఒకేలా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే మీరు దేనికైనా అప్లై చేసుకున్నప్పుడు వెరిఫికేషన్ ప్రాసెస్ రిజెక్ట్ అవ్వొచ్చు.  ఇలాంటి సమయంలో మీరు పైన చెప్పిన విధంగా మీ మొబైల్ నుంచి పాన్ వివరాల్లోని తప్పులను సరిదిద్దుకోవచ్చు. ఇక ఈ-పాన్ ఆప్షన్ ద్వారా మీరు సెకన్లలోనే పాన్ కార్డు డిజిటల్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Follow Us
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్
పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!
పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!
మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!
మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!
SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?
SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?
రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే
బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే
కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి
కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి
భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35
భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35
ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో
ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో
నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..
నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..