‘ఆంటీ’ అని పిలిచినందుకు వీర బాదుడు బాదింది

అటెన్షన్‌... అమ్మాయిలు...అబ్బాయిలూ ! అప‌రిచిత మ‌హిళ‌ల‌ను ఆంటీ అని పిలిచేముందు ఒక‌టికి రెండుసార్లు ఆలోచించుకోండి. పొర‌పాటున ఆంటీ అని పిలిచిన‌ప్పుడు వాళ్లకు తిక్క లేస్తే....

'ఆంటీ' అని పిలిచినందుకు వీర బాదుడు బాదింది
Follow us

|

Updated on: Nov 05, 2020 | 8:17 AM

అటెన్షన్‌… అమ్మాయిలు…అబ్బాయిలూ ! అప‌రిచిత మ‌హిళ‌ల‌ను ఆంటీ అని పిలిచేముందు ఒక‌టికి రెండుసార్లు ఆలోచించుకోండి. పొర‌పాటున ఆంటీ అని పిలిచిన‌ప్పుడు వాళ్లకు తిక్క లేస్తే ఏమౌతుందో తెలుసా! మీ ఒళ్లు హూనమయ్యే ప్రమాదం ఉంది. ఇందుకు ఉత్తర‌ప్రదేశ్‌లో జ‌రిగిన ఘ‌ట‌నే నిలువెత్తు నిద‌ర్శనం.

ఈటాలోని బాబూగంజ్ మార్కెట్‌లో కొంద‌రు మ‌హిళ‌లు షాపింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ అమ్మాయి అక్కడే ఉన్న ఓ మ‌హిళ‌ను ఆంటీ అని పిలిచింది. ఇంకేముంది ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది. న‌న్నే ఆంటీ అంటావా? అంటూ అమ్మాయి జుట్టు ప‌ట్టుకుని మ‌రీ చిత‌క‌బాదింది. ఆమె అలా వీర‌బాదుడు బాదుతుంటే ఆపాల్సింది పోయి అక్కడే ఉన్న మ‌రికొంద‌రు మ‌హిళ‌లు ఆమెకు సాయం చేశారు. ఇంత‌లో  ఓ మ‌హిళా పోలీసు జోక్యం చేసుకోవ‌డంతో గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది. ఈ ఘ‌ర్షణ‌పై ఎలాంటి కేసు న‌మోదు కాలేదు. ఇక‌ ఈ కొట్లాట‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Also Read :

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ !

ఏపీ : స్కూళ్లలో కరోనా వ్యాప్తి, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు

ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ, అంతా క్షేమం